కరోనా వైరస్‌పై పోరాటం చేసేందుకు గాను భారత్‌కు ప్రపంచ బ్యాంక్ భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. భారత్‌కు దాదాపు రూ.7,630 కోట్లు(1 బిలియన్ డాలర్లు) అందివ్వనుంది. ప్రపంచ వ్యాప్తంగా 25 అభివృద్ధి చెందుతున్న దేశాలకు కేటాయించిన అత్యవసర సహాయ నిధి 1.9 బిలియన్ డాలర్లను సంస్థ విడుదల చేయనుంది. ఈ నిధులతో 40 దేశాల్లో కరోనా నిరోధక ప్రక్రియను వేగవంతం చేయనుంది. ఈ నిధుల్లో అధికంగా భారత్‌కు 1 బిలియన్ డాలర్లను ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది.భారత్‌లో ఇప్పటివరకు కరోనా కేసులు 3000కు చేరగా, 78 మృత్యువాతపడ్డారు. దక్షిణాసియాలో పాకిస్తాన్‌కు 200 మిలియన్ డాలర్లు, ఆఫ్ఘనిస్తాన్‌కు 100 మిలియన్ డాలర్లు, మాల్దీవులకు 7.3 మిలియన్ డాలర్లు, శ్రీలంకకు 128.6 మిలియన్ డాలర్లు ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. కరోనా వైరస్ కట్టడి కోసం పోరాటానికి గాను వచ్చే 15 నెలల్లో 160 బిలియన్ డాలర్లు గ్రాంట్ దిశగా ప్రపంచ బ్యాంక్ పనిచేస్తోంది. ఈ నిధులతో తక్షణమే ఆయా దేశాలు ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వ్యవస్థ రికవరీపై దృష్టి పెట్టాలని ప్రపంచ బ్యాంక్ భావిస్తోంది.
7వేల కోట్లకు పైగా భారత్‌కు సాయం
Related tags :