దేశంలోని పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్‌డౌన్ కొనసాగించాలని ప్రధాని మోదీకి సూచించానని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. అమెరికా, స్పెయిన్, ఇటలీ దేశాలతో పోలిస్తే మనదేశంలో పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 364కి చేరుకుందని.. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 308 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు. దిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిలో 172 మందికి వైరస్ సోకిందని.. వారి ద్వారా 93 మంది కుటుంసభ్యులకూ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కేసీఆర్ వివరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం…
?నిజముద్దిన ఘటన అందరిని అతలాకుతలం చేసింది.
?అమెరికాలో అత్యంత దారుణంగా పరిస్థితులు నెలకొన్నాయి…
?ఢిల్లీకి వెళ్లొచ్చిన 1089 మందిని గుర్తించం…
?30 మంది ఇప్పటికే డిచ్చార్జ్ అయ్యారు…
?రెపటివరకు 25,937 మంది క్యారంటైన్ ముగుస్తుంది…
?ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 172 మంది 93 మందికి వైరస్ అంటించారు…
?రాష్ట్రంలో ఈ రోజు వరకు 364 మందికి కరోన వైరస్ సోకింది…
?ప్రపంచ వ్యాప్తంగా 22 దేశాలు కంప్లిట్ గా లాక్ డౌన్ చేశాయి…
?మర్కజ్ వెళ్లివచ్చిన వారు ఎవరెవరిని కలిశారో ఆ 3 వేల మంది ని కలిశాం…
?30,35 మంది ఢిల్లీ లొనే ఉన్నారు…
?మన రాష్ట్రానికి ఆదాయం భారీగా పడిపోయింది…
?ఇప్పటివరకు రాష్ట్రంలో11 మంది మృతి చెందారు…
?లాక్ డౌన్ తోనే దేశంలో రాష్ట్రంలో పరిస్థితులు అదుపులో ఉన్నాయి…
?గాందీలో 308మందికి చికిత్స అందిస్తున్నారు…
?ప్రధానితో రోజుకు రెండు మూడు సార్లు మాట్లాడుతున్నారు…
?ఇంటలిజెన్స్ సిబ్బంది చాలా బాగా పనిచేశారు వారికి థాంక్స్…
?BCG జూన్ 3వరకు లాక్ డౌన్ కొనసాగించాలని చేస్తోంది…
?బతికి ఉంటే బలుసాకైన తిని బతుకొచ్చు…
?రూ.24000కోట్లు రావాల్సింది కేవలం 6కోట్లు వచ్చాయి…
?మనకు లాక్ డౌన్ తప్ప వేరే మార్గం లేదు…
?కష్టాలు కన్నీళ్లు పంచుకునే వాళ్ళు మనకిప్పుడు కావాలి…
?లాక్ డౌన్ తీయాలంటే అంత ఈజీ కాదు…
?కవులు గాయకులు రచయిత ముందుకు రావాలి…
?ప్రధాని అడిగితే లాక్ డౌన్ కొనసాగించాలని చెప్పా…
?ప్రధాని వ్యక్తి కాదు ఒక ఇన్స్ట్యూషన్…
?వైద్య సిబ్బంది కి ప్రత్యేక కృతజ్ఞతలు…
?వైద్య సిబ్బంది ప్రాణాలు పోతాయని తెలిసిన వైద్యం అందిస్తున్నారు…
?ప్రధానిని హేళన చేసినవారు కుసంస్కరులు దుర్మార్గులు…
?ప్రధాని పై సోషల్ మీడియాలో జోకు లు వేస్తున్నారు ఇదేం పద్దతి…
?కరోన పై ప్రత్యేకంగా 8 హాస్పటల్స్ ఏర్పాటు చేశాం…
?దీపాలు వెలిగించాలనేది ఐక్యతకు చిహ్నం…
?10శాతం వైద్య సిబ్బందికి వెంటనే సీఎం గిఫ్ట్ గా ఇస్తున్నాం…