NRI-NRT

కొరోనాతో అమెరికాలో తెలుగు పాత్రికేయుడు మృతి

కొరోనాతో అమెరికాలో తెలుగు పాత్రికేయుడు మృతి-Brahma Kanchibhotla

సౌత్ ఏషియన్ టైమ్స్ అనే అంతర్జాల పత్రికకు న్యూయార్క్ నుండి విలేఖరిగా సేవలందిస్తున్న కంచిభొట్ల బ్రహ్మ అనే ప్రవాసాంధ్రుడు సోమవారం నాడు మృతి చెందారు. మార్చి 28న ఆయన పరిస్థితి విషమించడంతో లాంగ్ ఐల్యాండ్ ఆసుపత్రిలో జేర్పించగా సోమవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన గతంలో న్యూస్ ఇండీయా టైమ్స్ పత్రికకు కూడా పనిచేశారు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా పరుచూరు.