ScienceAndTech

వాట్సాప్ అడ్మిన్లపై ఆ వార్త ఫేక్

WhatsApp Admins Cannot Be Jailed

కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. దేశంలో నానాటికీ కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో సామాజిక మాధ్యమాల వేదికగా అసత్య, అబద్ధపు వార్తలు కరోనా వైరస్‌ కన్నా వేగంగా వెళ్లిపోతున్నాయి. ముఖ్యంగా కరోనాపై మీమీస్‌, జోక్స్‌, ఫేక్‌ న్యూస్‌ వాట్సాప్‌లో విస్తృతంగా షేర్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో ఒక సందేశం చూసి వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్లు వణికిపోతున్నారు. ఏదైనా గ్రూప్‌లో వాట్సాప్‌ ఫేక్‌న్యూస్‌ ఉన్నట్లు గుర్తిస్తే ఆ గ్రూప్‌ అడ్మిన్‌పై సెక్షన్‌ 68, 10, 188 కింద న్యాయపరమైన చర్యలు తప్పవని, అందుకు రెండు రోజుల పాటు వాట్సాప్‌ గ్రూప్‌ మూసేయాలని గత రెండు, మూడు రోజులుగా ఓ సందేశం వాట్సాప్‌ గ్రూపుల్లో విపరీతంగా వైరల్‌ అవుతోంది. దీన్ని చూసి వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్లు భయాందోళనకు గురవుతున్నారు. ‘‘వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌లందరికీ విన్నపం. రెండు రోజుల పాటు మీ వాట్సాప్‌ గ్రూప్‌ను మూసేయండి. గ్రూపులోని ఏ సభ్యుడైనా పొరపాటునైనా కరోనాపై జోక్స్‌, మీమీస్‌ షేర్‌ చేస్తే అడ్మిన్‌, ఆ గ్రూప్‌లోని సభ్యులపై సెక్షన్‌ 68, 140, 180కింద చర్యలు తప్పవు. అందుకు అనుగుణంగా గ్రూప్‌ అడ్మిన్లు మసలు కోవాలని మనవి చేస్తున్నాం’’ ఇది గత రెండు మూడు రోజులుగా వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న సందేశం. దీంతో చాలా మంది వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్లు సెట్టింగ్స్‌ మార్చేశారు. కేవలం అడ్మిన్లు మాత్రమే సందేశాలు పంపేలా మార్పులు చేశారు. ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఈ సందేశం ప్రకారం రెండు రోజుల పాటు వాట్సాప్‌ గ్రూప్‌ను మూసేయడం సాధ్యం కాదు. తాత్కాలికంగా వాట్సాప్‌ గ్రూప్‌ను మూసేయలేరు. కేవలం డిలీట్‌ చేయగలం. గ్రూప్‌లో ఎవరు ఉండాలి? ఎవరిని తొలగించాలనే అధికారం పూర్తిగా అడ్మిన్‌కు ఉంటుంది. ఆ సందేశంలో ఉన్నట్లు 68, 140, 180 సెక్షన్‌లు అంటూ నంబర్లు ఇచ్చారు. అవి ఏ యాక్ట్‌ కిందకు వస్తాయి? ఏ ఆర్టికల్‌ పరిధిలోకి వస్తాయన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ‘‘వాట్సాప్‌ గ్రూపుల్లో కరోనాపై ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేసేవారిపైనా, ఆ గ్రూప్‌ అడ్మిన్‌పైనా న్యాయపరమైన చర్యలు తప్పవని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇది ఫేక్‌ న్యూస్‌. ప్రభుత్వం అలాంటి ఆదేశాలు ఏమీ జారీ చేయలేదు’’ అని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ ట్విటర్‌ వేదికగా స్పష్టత ఇచ్చింది.

Sharing Coronavirus Joke in WhatsApp Group Can Land You in Jail ...