Politics

ఫిర్యాదుల బాటలో చంద్రబాబు

Chandrababu complains to governor

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కు ప్రతిపక్ష నేత, చంద్రబాబు ఫిర్యాదు..

ఏపీ గవర్నర్‌ హరిచందన్‌కు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లేఖ రాశారు.

రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరితే తమ ఎమ్మెల్యేను అక్రమంగా అరెస్ట్‌ చేశారని గవర్నర్‌‌కు చంద్రబాబు ఫిర్యాదు చేశారు.

ఫోన్‌లో కలెక్టర్‌ స్పందించకపోవడంతో నేరుగా వెళ్లి కలిసి వినతిపత్రం ఇవ్వాలని రామానాయుడు నిర్ణయించారని, భీమవరం వద్ద ఆయనను పోలీసులు అడ్డుకుని వెనక్కిపంపారని చంద్రబాబు అన్నారు.

నర్సాపురం, భీమవరం వైసీపీ ఎమ్మెల్యేలు వందలాది మందితో సమావేశం నిర్వహించినా వారిపై చర్యలు తీసుకోలేదని గవర్నర్‌కు రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

రైతు సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను చంద్రబాబు కోరారు.