పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ భారత జట్టు మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్‌కు ట్విటర్ వేదికగా సవాల్ విసిరాడు. ‘ కైఫ్.. నీ కొడుకు కబీర్‌కు, నా కొడుకు మైఖేల్ అలీ అక్తర్‌కు చిన్న పోటీ పెడదాం.. వారిద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం.. అయితే నీ కొడుకును నేను మనస్పూర్తిగా ఇష్టపడుతున్నా ‘ అంటూ ట్విటర్‌లో సవాల్ విసిరాడు. అయితే ఇదంతా సీరియస్ అనుకునేరు.. ముమ్మాటికి కానే కాదు. అసలు విషయం ఏంటంటే.. కరోనా వైరస్ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైప్ ఇంటికే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో తన కొడుకు కబీర్‌తో కలిసి పాత క్రికెట్ మ్యాచ్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా భారత్- పాక్ మధ్య జరిగిన ఒక మ్యాచ్‌లో కైఫ్ ఇన్నింగ్స్ ఆడుతుండగా షోయబ్ అక్తర్ బౌలింగ్ వేశాడు. కాగా షోయబ్ వేగంగా వేసిన బంతిని అంతే వేగంతో బౌండరీకి తరలించడంతో కబీర్ ఆనందంతో గెంతులేశాడు. ‘ పప్పా.. షోయబ్ బౌలింగ్‌ను ఈజిగా ఎదుర్కోవచ్చు.. ఎంత వేగంతో వేసినా అది కచ్చితంగా బౌండరీకి పంపిచొచ్చు. అందుకు ఉదాహరణ నువ్వే అంటూ’ కబీర్ కైఫ్‌కు తెలిపాడు. ఈ విషయాన్ని మహ్మద్ కైఫ్ తన ట్విటర్‌లో పంచుకున్నాడు.’ థ్యాంక్స్ టూ స్టార్‌స్పోర్ట్ ఇండియా.. ఒక చారిత్రాత్మక మ్యాచ్‌లో నేను బాగస్వామ‍్యం కావడం.. ఇప్పుడు నా కొడుకు నన్ను పొగడడం సంతోషంగా ఉందంటూ’ షేర్ చేశాడు. దీనిపై అక్తర్ స్పందిస్తూ.. ‘ మా అబ్బాయికి, మీ అబ్బాయికి పోటీ పెడదాం.. మావాడి పేస్‌ను ఎదుర్కొంటాడో లేదో చూద్దాం’ అంటూ ఫన్నీగా పేర్కొన్నాడు. అంతకుముందు మహ్మద్ కైఫ్ కరోనాపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు ఒక వీడియో షేర్ చేశాడు.’ దేశవ్యాప్తంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ను అరికట్టాలంటే అందరూ ఇంట్లోనే ఉండండి. ప్రధాని మోదీ చేసిన సూచనలను తప్పకుండా పాటిస్తూ ప్రతీ ఒక్కరు సామాజిక దూరం పాటించండి.. ఆరోగ్యంగా ఉండండి’ అంటూ తెలిపాడు. కాగా ప్రసుత్తం భారత్‌లో 5వేలకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 150 కి చేరుకుంది.
కైఫ్ Vs అక్తర్
Related tags :