Kids

బద్ధకపు శిష్యుడు-తెలుగు చిన్నారుల కథ

Lazy Disciple - Fatty Teacher : Telugu Kids Funny Moral Stories 2020

పూర్వం ఒక ఊరిలో అయోద్యుడు అనే బద్దకస్తుడు ఉండేవాడు. ఏపని చేసేవాడు. తినడం తిరగడం. ఇంతకుమించి ఏపని రాదు. పైగా అమాయకుడు. ఇంట్లో వారు భరించలేక ఏదన్నా ఆశ్రయం చూసుకొని వెళ్ళమన్నారు. సరేనని ఆశ్రమంలో చేరడానికి బయలుదేరి చాలా ఆశ్రమాలు చూశాడు. ఓ ఆశ్రమంలో గురువుగారు కొద్దిగా లావుగా ఉన్నారు. ఆహా ఇక్కడ భోజనం బాగా దొరుకుతుందనుకుంటా బాగా లావుగా ఉన్నారు అనుకున్నాడు. ఇంతలో శిష్యులు వచ్చారు. వాళ్ళు కూడా లావుగానే ఉన్నారు. అయితే సందేహం లేదు ఇక్కడ చేరితే మూడుపూటల భోజనం దొరుకుతుంది అనుకోని గురువుగారి పాదాల మీద పడి ఇక్కడే ఉండిపోతానన్నాడు. సరే అన్నాడు గురువుగారు.

అయితే నాకు మూడుపూటల భోజనం కావాలి అన్నాడు అయోద్యుడు. నాయనా! చక్కగా సేవ చేస్తూ రెండుసార్లు మాత్రమె ఇక్కడ భోజనం తీసుకోవాలి అన్నారు. కాదు గురువుగారు నేను ఆకలికి ఉండలేను అన్నాడు. సరే ఉదయం ప్రసాదం కొద్దిగా ఎక్కువ తిను అంటే సరేనన్నాడు.

ఏదో తెలిసిన సేవ చేస్తూ చాలీచాలని ఆహారం తింటూ ఉండగా ఏకాదశి వచ్చింది. ఈరోజు ఉపవాసం ఉండాలి అన్నారు. అమ్మో ఉపవాసం నావల్ల కాదు గురువుగారు. ఉండలేను అన్నాడు శిష్యుడు. సరే అయితే ఇక్కడికి దూరంగా ఉన్న చెరువు వద్దకి వెళ్లి వండుకుతిను. కావాలంటే సరంజామా నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు గురువుగారు. సరేనని సరంజామా తీసుకున్నాడు శిష్యుడు. నాయనా వండిన ఆహారం స్వామికి నైవేద్యం పెట్టి ఆ తరువాతే నువ్వు తినాలి సరేనా అనగా అలాగే గురువుగారు అని వెళ్లి చెరువు దగ్గర చెట్టు క్రింద వంట చేసుకొని భగవంతుడికి నైవేద్యం పెట్టి.

రాజా రామ్ ఆయియే, రఘురామ్ ఆయియే మేరా భూక్ లాగాయియే అంటూ పాడడం మొదలు పెట్టాడు. ఎంతకీ స్వామి రాడే.. (ఇతని ఉద్దేశ్యం లో స్వామివారే స్వయంగా వచ్చి తింటారని అనుకుని ఎదురుచూస్తూ ఉన్నాడు. అంతటి అమాయకుడు. కపటం, కంఫ్యూషన్ లేదు మనస్సులో) ఎంతకీ రాకపోయేసరికి బాగా ఆలోచించి “దేవాలయంలో అయితే ప్రసాదాలు, నైవేద్యాలు పెడతారు. ఇక్కడ ఏముంది. కదిరి కుదరని వంట తప్ప” స్వామి అక్కడైతే బాగా పెడతారని అనుకుంటున్నావేమో ఈరోజు ఏకాదశి అక్కడ ఏమి ఉండదు. ఏమి పెట్టరు. ఇక్కడికి కూడా రాలేదనుకో ఇది కూడా ఉండదు అని మళ్ళీ పాడడం మొదలు పెట్టాడు. ఇది కూడా అయిపోతుందని.. శ్రీరాముడు నవ్వుకుని ఉండబట్టలేక సీతాసమేతంగా వచ్చాడు.

శ్రీరాముడిని చూశాడు సంతోషించాడు. కానీ పక్కనే సీత ఉంది. సీత వంక ప్రసాదం వంక పదేపదే చూస్తూ ఉండగా.. మేము వచ్చాము సంతోషమేగా అంటే సీతావంక చూస్తూ ఆ ఆ సంతోషమే నాచేత ఏకాదశి ఉపవాసం చేయించాలనుకున్నట్లు ఉన్నారు. రండి కూర్చోండి అని ఇద్దరికి వండిన ఆహారం పెట్టాడు. చక్కగా భోజనం చేసి సీతారాములు వెళ్లిపోయారు.

మళ్ళీ ఏకాదశి వచ్చింది. గురువుగారు మొన్న ఇచ్చినట్లే ఈసారి కూడా కిలో బియ్యం పప్పులు దినుసులు ఇచ్చారు. అప్పుడు.. గురువుగారు సరిపోవడం లేదండి. ఇద్దరొచ్చారు ఇంకాస్త కావాలి అంటే.. వీడికి సరిపోతున్నట్లు లేదు ఇంకో కేజీ ఇచ్చి పంపండి అన్నాడు. యధావిధిగా వెళ్లి వంట చేసి.. నైవేద్యం పెట్టి, తులసి పెట్టి.. మొన్న ఇద్దరు వచ్చారు కదా.. అందుకని

రాజారామ్ అయియే, సీతారాం ఆయియే మేరా భోజన్ కో భోగ్ ధరాయియే అంటూ పాడాడు. ఈసారి సీతారాముల తో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. ఈసారి లక్ష్మణుడు వంక భోజనం వంక చూస్తూ ఉండగా.. శ్రీరాముడు.. మేము వచ్చాము సంతోషమేగా అంటే లక్ష్మణుడి వంక భోజనం వంక చూస్తూ ఆ సంతోషమే ఈ వారం కూడా ఉపవాసమే.. రండి కూర్చోండి అన్నాడు. భోజనం పెట్టాడు . ముగ్గురు తిన్నారు వెళ్లారు.

మళ్ళీ ఏకాదశి వచ్చింది. గురువుగారితో ఇది సరిపోదండి మూడు వచ్చారు అన్నారు. వీడు రాత్రికూడా తింటున్నాడేమో అనుకోని మరో కేజీ ఇచ్చి పంపారు. మళ్ళీ వండాడు. ఈసారి పాట మార్చి పాడాడు.. రాజారామ్ ఆయిఏ, సీతారాం అయిఏ, లక్ష్మణ్ సాత్ అయిఏ మేరా భోజన్ కో భోగ్ ధరాయిఏ

ఈసారి సీతారాములు, లక్ష్మణుడు వచ్చారు. వీళ్ళతోపాటుగా హనుమాన్ వచ్చాడు. మేము వచ్చాము ఆనందమేగా ఆనందమే కానీ అంటూ హనుమాన్ వంక భోజనం వంక చూసి ఈ ఏకాదశి కూడా ఉపవాసమే.. రండి కూర్చోండి అని వడ్డించాడు. అందరూ కూర్చొని తృప్తిగా తినేసి వెళ్లిపోతూ ఉండగా స్వామి ఏమనుకోనంటే ఒకమాట అడగవచ్చా? ఈసారి ఎంతమంది వస్తారు? అనగా శ్రీరాముడు నవ్వి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయాడు..

మళ్ళీ ఏకాదశి వచ్చింది. గురువుగారు ఈసారి రవ్వ 10కిలో, బియ్యం పదికిలో, పచారి పదికిలో కావాలి అన్నాడు. గురువుగారికి వీడేమైనా అమ్ముకుంటున్నాడా అనే సందేహం వచ్చినా వాడు అడిగింది. తరువాత చుద్దాం అన్నాడు. అలాగే గురువుగారి ఆజ్ఞప్రకారం అన్ని పది కిలోల చొప్పున ఇచ్చి పంపి గురువుగారి దగ్గరికి వచ్చారు శిష్యులు. వీడు అమ్ముకుంటున్నట్లు ఉన్నాడు. ఎక్కడ అమ్ముతున్నాడు? ఏదుకాణంలో అమ్ముతున్నాడు. చుద్దాం పదండి అని గురువుగారిలో సహా అయోద్యుడి వెనుక బయలుదేరారు.

Lazy Disciple - Fatty Teacher : Telugu Kids Funny Moral Stories 2020