Movies

సోనాలీ కరోనా చిట్కాలు

Sonali Bendre COVID19 Fight Tips

శరీరంలో రోగ నిరోధకశక్తి పెంచుకోవడానికి బాలీవుడ్‌ నటి సోనాలీ బింద్రే మూడు చిట్కాల్ని పంచుకున్నారు. కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ సమయంలో మనలోని ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవడం ఎంతో ముఖ్యమని సూచించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేశారు. తనకు క్యాన్సర్‌ ఉందని తెలిసిన తర్వాత పాటించిన మూడు ఆరోగ్య సూత్రాల్ని అందులో చెప్పారు. మొదటిది ముఖానికి ఆవిరి పట్టుకోవడం, రెండోది గ్లాసు వేడి నీరు తాగడం. మూడోది… ఆపిల్‌, క్యారెట్‌, అల్లం, ఆల్మాండ్‌, తాజా పసుపు, ఉసిరి తదితర పదార్థాల్ని కలిపి జ్యూస్‌చేసి తాగమని కోరారు. ‘మన రోగనిరోధక శక్తి బాగా పనిచేయాలన్న విషయం గతంలో కంటే ఇప్పుడు మనకు బాగా అర్థమైంది. నేను క్యాన్సర్‌తో పోరాడుతున్న సమయంలో.. నా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఏం చేయాలని చాలా పరిశోధనలు చేశా. అప్పటి నుంచి ఈ మూడు చిట్కాల్ని ఫాలో అవుతున్నా. ఇప్పుడు నా జీవనశైలిలో ఇవి భాగమైపోయాయి. నేను ‘సీక్రెట్‌ ఫార్ములా’గా భావించే వీటిని మీతో పంచుకుంటున్నా. ఇకనైనా మనమంతా రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టిపెడతామని ఆశిస్తున్నా’ అని సోనాలీ బింద్రే పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఆమె స్వీయ నిర్బంధంలో ఉన్నారు. కుటుంబ సభ్యులు, పుస్తకాలు, పెంపుడు జంతువులతో సమయం గడుపుతున్నారు.