WorldWonders

బెంగాల్‌లో మద్యం ఆన్‌లైన్ డెలివరీ

West Bengal Approves Online Delivery of Liquor

లాక్‌డౌన్‌ కారణంగా మద్యం దొరక్క అవస్థలు పడుతున్నవారికి పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్టుగా తెలుస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్రంలో మద్యం హోమ్‌ డెలివరీకి అనుమతించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయం తీసకున్నట్టు ఎక్సైజ్‌ శాఖ వర్గాల నుంచి విశ్వసనీయంగా తెలిసింది. అయితే లాక్‌డౌన్‌ వల్ల మూతపడ్డ మద్యం షాపులను తెరవబోమని ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసుకున్నవారికి మాత్రం మద్యం షాపుల నుంచి హోం డెలివరీ చేయనున్నట్టు చెప్పారు.