గోరింటాకును ఇష్టపడని మహిళలు ఉండరు. గోరింటాకు అందానికి మాత్రమే కాదు .ఆరోగ్యానికి కూడా అందిస్తుంది. ఇంతకీ అవేంటంటే…ఆషాడంలో గ్రీష్మ ఋతువు ముగిసిన వర్ష ఋతువు ప్రారంభం అవుతుంది. ఈ సీజన్ లో శరీరంలోని వేడి బయటకు వెళ్లిపోయి అనారోగ్యా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గోరింటాకు పెట్టకుంటే రోగ నిరోధక శక్తి పెరిగి ,వేడి బయటకు పోకుండా అలాగే ఉంటుంది. అందుకే ఆషాడంలో కచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలనే ఆచారం మొదలైంది.గోరింటాకు మీద అంతర్జాతీయ స్థాయిలో పలు పరిశోధనలు జాగిగాయి. పైత్యం చర్మ వ్యాధులకు సంబంధించిన సమస్యలను గోరింటాకు నయం చేస్తుంది.చేతులు ,కాళ్లు మంటగా అనిపిస్తే గోరింటాకు రసంలో నిమ్మరసం కలిపి అందులో కాళ్లు, చేతులు ఉంచితే నొ ప్పి క్షణాలో తగ్గిపోతుంది.రాత్రి నాన బెట్టిన గోరింటాకును మరుసటి రోజు ఉడికించి ఆ కషాయాన్ని బెణికిన గాయాలైన ప్రాంతంలో రాస్తే ఆ గాయాలు ,నొప్పులు తొందరగా తగ్గిపోతాయి.నిద్రలేమితో బాధపడే వారు గోరింటాకు పువ్వులను తలకింద పెట్టుకుని పడుకుంటే సుఖంగా నిద్రపట్టడమే కాకుండా ఉదయాన్నే లేవగానే ఉత్సహంగా ఉల్లాసంగా ఉంటారు.
గోరింటాకుతో ఆరోగ్యం
Related tags :