కరోనా & లాక్డౌన్ సమయంలో తెరపైకి వచ్చిన నిజాలు..
……….. ……………………………..
1. అమెరికా నేడు ప్రముఖ దేశం కాదు.
2. ప్రపంచ సంక్షేమం గురించి చైనా ఎప్పుడూ ఆలోచించదు.
3. యూరోపియన్లు వారు ఉండాల్సినంత విద్యావంతులు కాదు.
4. యూరప్ లేదా అమెరికా వెళ్ళకుండా కూడా మన సెలవులను ఆనందంతో గడపవచ్చు.
5. భారతీయుల రోగనిరోధక శక్తి ప్రపంచ ప్రజల కంటే చాలా గొప్పది.
6. మన ఆచార వ్వవహారాలు , ఆహార అలవాట్లు చాలా గొప్పవని ప్రపంచానికి తెలిసింది .
7. ~వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, ప్రభుత్వ పరిపాలన సిబ్బంది మాత్రమే నిజమైన హీరోలు? _… క్రికెటర్లు, సినీ తారలు మరియు ఫుట్‌బాల్ ఆటగాళ్ళు హీరోలు కాదు. బొమ్మలు మాత్రమే.
8. వినియోగం లేకుండా ప్రపంచంలో బంగారం, వజ్రాలు ప్రాముఖ్యత లేదనేది తెల్సింది.
9. ఈ ప్రపంచం కూడా తమకు చెందినదని జంతువులు మరియు పక్షులు మొదటిసారి భావించాయి.
10. నక్షత్రాలు నిజంగా మెరుస్తున్నాయి, ఆకాశంలో చూడంగానే ఈ నమ్మకం మొదట పిల్లలకు నమ్మక కల్గింది.
11. ప్రపంచంలోని చాలా మంది ప్రజలు తమ పనిని ఇంటి నుండే చేయవచ్చు అని తెలుసుకున్నారు.
12. మనం మరియు మన పిల్లలు ‘జంక్ ఫుడ్’ లేకుండా జీవించగలం.అనేది నమ్మకము కల్గింది.
13. పరిశుభ్రమైన జీవితాన్ని గడపడం చాలా కష్టమైన పని కాదు. అనేది అర్థం అయ్యింది.
14. మహిళలకు మాత్రమే ఆహారం ఎలా ఉడికించాలో తెలుసు అనుకున్న రోజులో మొగవాళ్ళు కూడా నేర్చుకుంటే బాగుంటుంది అనే భావం కల్గింది
15. మీడియా అబద్ధాలు లో అబద్దాలు మరియు అర్ధంలేని న్యూస్ లు కూడా ఉంటావి అనేది అన్ని చానల్ చూసిన తరువాత తెల్సింది….
16. నటులు వినోదం మాత్రమే మరియు జీవితంలో నిజమైన హీరోలు కాదు….అనేది సత్యం…
17. భారతీయ మహిళ కారణంగా ఇంటి ఆలయం ఎలా ఉండాలి అనేది పరాయి దేశం నేర్చుకునేటట్టు నిర్మించబడింది….
18. డబ్బుకు విలువ లేదు ఎందుకంటే ఈ రోజు పులుసు తో అన్నం తిని కూడా బత్కొచ్చు అనేది నేర్పింది ..
19. భారతీయులలో పట్టణ , గ్రామములో ప్రజలు నిండు మనసుతో మానవత్వం ఉన్న ప్రజలు అని ప్రపంచానికి తెలిసింది ….
20. భారతీయుడు మాత్రమే క్లిష్టమైన సమయాన్ని సరిగ్గా నిర్వహించగలడు , వినియోగించుకోగలడు .
చివరగా విపత్తు వొచ్చినప్పుడు అధికార, విపక్షాలు, కుల మతాలు , ప్రాంతీయ , భాషా భేదాలు లేకుండా భారతీయులు అందరు క్రమశిక్షణతో ఒక్కతాటిపై వుంటారని ప్రపంచనికి చాటి చెప్పారు భారతీయులు? ~..??జై భారత్ , జై హింద్ ?
####################
1. కరోనా పుణ్యమా అని
ఇంటిల్లిపాది ఇంట్లోనే బందీయై
అత్తా కోడళ్ళ మధ్య
పంతాలు పక్కన పెట్టి
అనురాగాలు పెనవేసుకుంటూ
పాత జ్ఞాపకాలను తవ్వుకుంటూ
సీరియల్స్, సినిమాలతో
కాలాన్ని కరగ తీస్తుంటే
2. ఆలి, పిల్లలను
ఆత్మ బంధువులను వదిలేసి
ఇంటి మురిపాలను మూటగట్టుకొని
సమాజ కర్తవ్యాన్ని చేత పట్టుకొని
ఎండకు మాడుతూ
కంటికి నిద్ర, కాలికి విశ్రాంతి లేకుండా
దొరికింది తింటూ
దొరకనప్పుడు ఎండుతూ
డేగ కళ్లతో లాక్ డౌన్ ను పర్యవేక్షిస్తూ
జనాలను రోడ్లపైకి రాకుండా
, కట్టడి చేస్తున్న రక్షకభటులకు
పాదాభివందనం.
3. రక్త బంధం లేకున్నా
.. దూరపు చుట్టాలు కాకున్నా
అంటుకున్న, ముట్టుకున్న
కరోనా కరుస్తుదని తెలిసినా
ఒళ్లంతా ధైర్యాన్ని నింపుకుని
రోగులే నేస్తాలు గా
దావఖానా లే
దేవాలయాలుగా తలుస్తూ
ఎగబాకుతున్న వైరస్ కు ఎదురొడ్డి
ప్రాణాలను నిలబెడుతున్న
పరబ్రహ్మ స్వరూపులు
డాక్టర్స్, నర్సులకు
పాదాభివందనం.
4. నడుమును వంచి
చీపుర్లను చేతబట్టి
పాచి నంత పార గొట్టి
చెత్తనంతా చేతులతో ఎత్తి
కంపు వాసనను
కడుపు నింపుకొని
సమాజం కోసం
కొవ్వొత్తిలా కరిగిపోతూ
చీపుర్లతో వైరస్ ను ఊడ్చేస్తున్న
పారిశుద్ధ వీరులకు,
పాదాభివందనం.
5. పగలనకా, రాత్రనకా
కలాన్ని కదిలించి
కరోనా కష్టాలను, నష్టాలను
కవర్ చేస్తున్న
మీడియా మిత్రులకు
పాదాభివందనం
6 క్లిష్ట సమయమిది
కోడి గుడ్డు మీద
ఈకలు పీకడం మానేసి
కన్నీళ్లను తుడిచే
చేతులు కావాలి
మానవత్వపు విత్తనాలు
మొలకెత్తాలి.
. కష్టాలను పంచుకునే
హృదయాలు కావాలి.