కన్నడ కంఠీరవుడు, రాజ్ కుమార్ (ఏప్రిల్ 24, 1929 – ఏప్రిల్ 12, 2006) గా ప్రసిద్ధి చెందిన డా. సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజు ప్రముఖ కన్నడ చలనచిత్ర నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.
లక్షలాది అభిమానులు “డాక్టర్. రాజ్” లేదా “అన్నావ్రు” (అన్నగారు) అని పిలిచే ఈయన కన్నడ చలనచిత్ర రంగములో అర్ధశతాబ్దము పాటు 200 సినిమాలలో నటించాడు. బంగారద మనుష్య (బంగారు మనిషి), కస్తూరి నివాస, గంధద గుడి, జీవన చైత్ర ఈయన నటించిన కొన్ని మరపురాని సినిమాలు.
మొదట శ్రీ పి.బి. శ్రీనివాస్ పాడినా, తరువాత తన పాటలు తానే పాడుకున్న రాజ్ కుమార్ సంగీత స్రష్ట, పేరొందిన గాయకుడు. తను నటించిన చిత్రాలకే కాక, నేపధ్య గాయకునిగా ఇతర నటులకు కూడా గాత్ర దానం చేశారు. ఇంకా అనేక భక్తి గీతాలు కూడా పాడారు.
తెలుగులో కాళహస్తి మహాత్యం (1954) సినిమాలో భక్త కన్నప్పగా అద్భుతంగా నటించాడు.