మలేషియా లో చిక్కుకున్న దినసరి కార్మికులకు తెరాస మలేషియా అండ.
సామాజికమాద్యమాల ద్వారా తెరాస మలేషియా సభ్యులు సందీప్ కుమార్ లగిశెట్టి మరియు శ్రీనివాస్ ముల్కల గార్ల దృష్టికి ఒక వీడియో రావడం జరిగింది. ఇక్కడ మలేషియాలో బ్రతుకుదెరువుకు వచ్చి దినసరి కార్మికులుగా చేస్తూ ఇప్పుడు ఉన్న లాక్ డౌన్ పరిస్థితుల దృష్ట్యా బయటికి వెళ్లలేక ఇబ్బంది పడుతూ ఉన్న మన తెలంగాణ వాసులను సామాజికసేవలో ముందుండే శ్రీకాంత్ ద్వారా గుర్తించడం జరిగింది. నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి తెరాస మలేషియా అధ్యక్షులు చిట్టిబాబు చిరుత ఆధ్వర్యంలో నెలకు సరిపడా నిత్యావసర వస్తువులకు నిధులు సమకూర్చి వారికి అందజేయడం జరిగింది. వారితరఫున శ్రీకాంత్ మాట్లాడుతూ తెరాస మలేషియా చేసిన సహాయానికి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, మలేషియా లో ఇబ్బందుల్లో ఉన్న వారికి అన్ని సమయాల్లో సహాయ సహకారాలు అందించే తెరాస మలేషియా దాతృత్వాన్ని కొనియాడారు. ఈ సందర్బంగా అధ్యక్షులు చిట్టిబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా కరోనా ఉధృతిని అడ్డుకునే నేపథ్యంలో కేసీఆర్ గారి సమయస్ఫూర్తి , వ్యూహరచన లతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని గుర్తుచేశారు. ప్రపంచం మొత్తం కోవిడ్ -19 గడగడలాడిస్తున్న వేళ ఇక్కడ మన తెలంగాణా వాసుల యోగక్షేమాలు తెరాస ఎన్నారై సమన్వయకర్త శ్రీ మహేష్ బిగాల గారు చిట్టిబాబు గారితో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అన్నివేళలా మేము ఉన్నామంటూ ధైర్యాన్నిస్తున్నారు. నిధులు సమకూర్చడంలో ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు రమేష్ గౌరు, మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, హరీష్ గుడిపాటి, శ్రీనివాస్ ముల్కల, సాయి హేమంత్, రఘునాత్ నాగబండి, రవిందర్ రెడ్డి , మరియు ఇతర దాతలు, ఓంప్రకాష్ బెజ్జంకి , రాజ్ కుమార్ రాకం , సురేష్ రామడుగు, శ్రీహరి సహకరించారు.