DailyDose

కరోనా మాస్క్‌లు కుక్కర్‌లో ఉడికించాలి-TNI కథనాలు

Steam Boil Your Corona Masks Before Reusing-TNILIVE Corona Bulletin

* కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి. అయితే ఇంట్లో తయారు చేసిన మాస్క్‌లను తరచూ శుభ్రం చేసుకోకపోతే అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. సాధారణంగా దుస్తులను శుభ్రం చేసిన రీతిలో మాస్క్‌లను ఉతికితే సరిపోదు. వీటిని ప్రత్యేకంగా శుభ్రం చేయాలి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారుడు కె.విజయ్‌ రాఘవన్‌ సూచించిన చిట్కాలను కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌లో పంచుకుంది. తిరిగి వినియోగించలేని మాస్క్‌లను శుభ్రం చేయకూడదని తెలిపింది. ఇంట్లో తయారు చేసిన మాస్క్‌ను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. సబ్బు, వేడి నీటితో ఉతకాలి. ఆ తర్వాత కనీసం అయిదు గంటల పాటు ఎండలో ఆరబెట్టాలి. అలా చేస్తేనే మాస్క్‌పై ఉన్న క్రిములు నశిస్తాయి. ఒక వేళ ఎండలో ఆరబెట్టే అవకాశం లేకపోతే.. నీటిలో ఉప్పు వేసి ప్రెజర్‌ కుక్కర్‌లో కనీసం 15 నిమిషాలు మాస్క్‌ను ఉడికించాలి. ఆ తర్వాత ఆరబెట్టాలి. ప్రెజర్‌ కుక్కర్‌ సదుపాయం కూడా లేకపోతే.. సబ్బుతో మాస్క్‌ను ఉతికిన తర్వాత ఇస్త్రీ పెట్టెతో ఓ అయిదు నిమిషాలు వేడి చేయాలని సూచించింది.

* తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రంలో 37 మంది కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 681కి చేరింది. వీరిలో 118 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అవ్వగా.. 18 మృతిచెందారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 545 మంది చికిత్స పొందుతున్నారు.

* తమిళనాడులో కరోనా ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇవాళ ఒక్క రోజే 38 కొత్త కేసులు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 1242కి చేరింది. ఇవాళ ఇద్దరు మృతి చెందగా.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మరణించిన వారి సంఖ్య 14కి చేరింది.

* ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌స్పాట్‌ జిల్లాలు: కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, కడప, పశ్చిమగోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, అనంతపురం. తెలంగాణలో హాట్‌స్పాట్‌ జిల్లాలు: హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి అర్బన్, జోగులాంబ గద్వాల, మేడ్చల్ మల్కాజిగిరి, కరీంనగర్, నిర్మల్.

* కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలను పూర్తిగా నిషేధించిన ప్రభుత్వం. రెండు జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్ట్లు ఏర్పాటు. సరిహద్దు ప్రాంతాలలో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసిన రెండు జిల్లాల పోలీసులు. పులిగడ్డ పెనుమూడి వారథి వద్ద రెండు జిల్లాల గుండా ప్రయాణాలు చేస్తున్న ప్రయాణీకులను అడ్డుకుని నిబంధనలు తెలియచేస్తున్న అవనిగడ్డ (కృష్ణాజిల్లా), రేపల్లె (గుంటూరు జిల్లా) పోలీసులు.

* Message from AP DGP office on currency notes issue: First of all it is not sent by the DGP…It’s just one of the possibilities of catching infection which our staff in office have incorporated in one of the many routine messages which are sent on a daily basis to keep alerting units on the ground. Just to be aware of the possibilities and to keep them alert all the while.

* అమెరికా ఆర్థిక వ్యవస్థను పరుగులెత్తించేందుకు ఏం చేయాలనేదానిపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్ల అధ్యక్షుడుకు డోనాల్డ్ ట్రంప్‌కు సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ట్రంప్‌యే స్వయంగా వైట్ హౌజ్‌లో జరిగిన పత్రికా సమావేశంలో ప్రకటించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజితం చేసేందుకు సిద్ధమైన ట్రంప్.. ఇందుకు తగిన సలహాలు ఇవ్వాలంటూ అమెరికాలోని పారిశ్రామిక వేత్తలు, నిపుణులను కోరారు. వివిధ రంగాలకు చెందిన 200 మంది ప్రముఖులతో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

* కరోనా వైరస్‌ గురించి వచ్చే వదంతుల్ని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వాట్సాప్‌ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరైన సమాచారం కోసం 82971 04104 నంబర్‌ను సంప్రదించాలని సూచించింది. లేదా ఫేస్‌బుక్‌లో కూడా మెసేజ్‌ చేయొచ్చని పేర్కొంది.

* గుజరాత్‌కు చెందిన ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌ అని తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ముందస్తు జాగ్రత్తగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అధికారుల సూచనల మేరకు సీఎం రూపానీ సెల్ఫ్‌ క్వారెంటైన్‌లోకి వెళ్లినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా తెలిసింది.

* కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్న కరెన్సీ నోట్లు.. గుర్తించిన ఏపీ అధికారులు…గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో రెండు కేసుల నమోదు…అప్రమత్తమైన యంత్రాంగం…డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన.

* మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన కేంద్రం.. అందుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. థియేటర్లు, మాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌, బార్లు మూసివేయనున్నట్టు తెలిపింది. అయితే ఏప్రిల్‌ 20 తర్వాత మాత్రం కొన్ని రంగాలకు కేంద్రం సడలింపులు ప్రకటించింది. దేశవ్యాప్తంగా వ్యవసాయ సంబంధిత అన్ని కార్యక్రమాలను కొనసాగించవచ్చని తెలిపింది. ఆన్‌లైన్‌ షాపింగ్‌, ఈ-కామర్స్‌ సం‍స్థలకు అనుమతిచ్చింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల నిర్వహణకు అనుమతి కల్పించింది.

* ఆంధ్రప్రదేశ్ లో 502కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు. కొత్తగా 19కేసుల గుర్తింపు. ఇండియా లో 11510 పాజిటివ్ కేసులు. 377 మరణాలు. తెలంగాణ లో 644 పాజిటివ్ కేసులు, 18 మరణాలు. మహారాష్ట్ర లో 2684 కేసులు, 178 మృతులు.