Food

లాక్‌డౌన్‌లో బెస్ట్ ఫ్రెండ్…నిమ్మకాయ

Eat Loads Of Lemon To Fight Corona-Telugu Food Diet News

వైరస్‌ని తిప్పికొట్టాలంటే.. మనలో రోగ నిరోధక వ్యవస్థని బలోపేతం చేసుకోవాలి. ఇందుకోసం విటమిన్‌-సి క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇది మనకు నిత్యం అందుబాటులో ఉండే నిమ్మపండులో పుష్కలంగా ఉంటుంది..

జలుబు రాకుండా..
* నిమ్మలో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.
* రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దాంతో జలుబు, జ్వరం రాకుండా ఉంటాయి.
* పంటి సమస్యలను దూరం చేస్తుంది. దంతాలను మెరిపిస్తుంది.
* రక్తహీనతతో బాధపడేవారు నిమ్మరసాన్ని తగినంతగా తీసుకోవాలి. ఇది ఇనుము శోషణలో ప్రధాన పాత్ర వహిస్తుంది. సెనగలు ఉడికించి తీసుకున్నప్పుడు దానిపై నిమ్మరసం చల్లుకుని తీసుకోవడం మంచిది. ఇనుము పుష్కలంగా ఉండే ఆహారంతోపాటు జతగా నిమ్మరసం కూడా కలిపి తీసుకుంటే ఆ ఇనుము శరీరానికి వంట పడుతుంది.
* ఎండ వేడిమి వల్ల కందిపోయిన చర్మానికి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది.
* చర్మంపై ముడతలు, బ్లాక్‌ హెడ్స్‌ని తగ్గిస్తుంది. నలుపును పోగొడుతుంది.
* ఉదయం పూట కాఫీకి బదులుగా నిమ్మరసం కలిపిన గ్రీన్‌టీ తాగండి. శరీరానికి కావాల్సిన సూక్ష్మపోషకాలు, విటమిన్‌-సి పుష్కలంగా అందుతాయి. ఇలా చేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా రోజంతా చురుగ్గా ఉంటారు. చర్మం ఆరోగ్యంగా, తాజాగా కనిపిస్తుంది.
* బరువు నియంత్రణలో భాగంగా కొందరు ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటారు. దాంతో కొన్ని అత్యవసరమైన సూక్ష్మపోషకాలు శరీరానికి అందకుండా పోతాయి. ఆ లోపాన్ని తగ్గించుకోవడానికి ఏదో ఒక రూపంలో నిమ్మరసం తీసుకోవాలి. సూక్ష్మపోషకాలతోపాటు యాంటీఆక్సిడెంట్లు కూడా అందుతాయి.
* చిరుధాన్యాలను ఉడికించేటప్పుడు నిమ్మతొక్కను వేస్తే సువాసనతోపాటు వాటి రుచి కూడా పెరుగుతుంది.