Movies

నాకు సమయం లేదు

నాకు సమయం లేదు

కస్తూరి నేల నుంచి వచ్చిన సుందరీమణులు టాలీవుడ్‌ని ఏకబిగిన ఏలుతున్నారు. అలనాటి సౌందర్య నుంచి ఇప్పటి రష్మిక వరకూ అందరూ తెలుగులో తమ సత్తా చాటుతున్నవారే. తొలి సినిమాతోనే తానేమిటో తెలుగువారికి రుచిచూపించింది రష్మిక. మిగతా హీరోయిన్లతో పోల్చుకుంటే ఎత్తు కొద్దిగా తక్కువే అయినా అది ఆమె ఎదుగుదలకు ప్రతిబంధంకం కాలేదు. ఇంతింతై వటుడు ఇంతై అన్న చందంగా తొలి సినిమా నుంచి తన కెరీర్‌ గ్రాఫ్‌ను పెంచుకుంటూ ‘కర్ణాటక స్టేట్‌ క్రష్‌’గా పేరు తెచ్చుకున్న రష్మిక రీసెంట్‌గా సూపర్ మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ సరసన నటిస్తుంది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు ఎలా అయితే వస్తున్నాయో.. అదే విధంగా గాసిప్స్ కూడా ఆమెపై విపరీతంగా వినిపిస్తున్నాయి. ఇదే విషయం ఆమెని అడిగితే.. అసలు వాటిని పట్టించుకునే తీరిక నాకు లేదంటుంది.