* కరోనా విజృంభణతో ప్రపంచ దేశాల్లో అపార ప్రాణ నష్టం సంభవిస్తుండగా.. వైరస్ పుట్టుకకు కేంద్ర స్థానంగా భావిస్తున్న చైనాలోని వుహాన్ నగరంలో మాత్రం మరణాలు తక్కువగా నమోదయ్యాయి. దీంతో అగ్రరాజ్యం అమెరికాతోపాటు అన్ని దేశాలు చైనా ‘చావు’ లెక్కలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వుహాన్ నగర పాలక సంస్థ తాజాగా మరో 1,290 మరణాలు లెక్కలోకి చేర్చింది. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా శుక్రవారం తెలిపింది. దీంతో 50 శాతం పెరుగుదలతో వుహాన్‌లో మరణాలు 3,869కి చేరాయి. నిన్నటివరకు అక్కడ మృతుల సంఖ్య 2,579 గానే ఉంది. ఇక చైనా వాప్తంగా 39 శాతం పెరిగి మృతుల సంఖ్య 4,632కు చేరింది. అమెరికా ఆరోపణలు, ఇతర దేశాల ఒత్తిళ్ల నేపథ్యంలోనే తాజా లెక్కలు బయటికొచ్చాయని పులువురు విశ్లేషిస్తున్నారు.
* కరోనా వైరస్ నియంత్రణపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎన్నో చూసిందని, కరోనా గురించి నైరాశ్యం వద్దని పేర్కొన్నారు. ప్రజలంతా భగవంతుడి రక్షణ కోరుకోవాలని సూచించారు. ఈ సమయంలో భగవంతుని నామస్మరణే భారతదేశానికి రక్షణ అని, లాక్ డౌన్ సమయంలో ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలన్నారు. పిల్లల్లో ఆధ్యాత్మిక చింతన పెంచాలని విజ్ఞప్తి చేశారు.
* రాష్ట్రానికి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లు. దక్షిణ కొరియా నుంచి వచ్చిన ర్యాపిడ్ టెస్టు కిట్లు. సియోల్ నుంచి ప్రత్యేక చార్టర్ విమానంద్వారా రాక. క్యాంపు కార్యాలయంలో టెస్టు కిట్లను ప్రారంభించిన సీఎం వైయస్.జగన్.
* గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ రోజు మరో 30 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ వెల్లడించారు. వీరిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. కరోనా సోకిన వారిని కలిసిన వ్యక్తులకు కూడా వైద్య పరీక్షలు చేసినట్టు తెలిపారు.
* మహారాష్ట్రలోని ముంబయి మహా నగరంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఈ ఒక్క రోజే 77 పాజిటివ్ కేసులు; ఐదు మరణాలు నమోదయ్యాయి. దీంతో ముంబయి మహానగరంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2120కి చేరగా.. ఇప్పటివరకు121 మంది మరణించారని గ్రేటర్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది.
* కరోనా మహమ్మారి విజృంభణ భారత్‌లో కొనసాగుతోంది. దేశంలో ఇప్పటివరకు (సాయంత్రం 5గంటల వరకు) 13,835మందికి ఈ వైరస్ సోకగా.. వీరిలో 1767 మంది కోలుకున్నారనీ.. 452మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర వైద్యశాఖ వెల్లడించింది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 3205 మందికి ఈ వైరస్ సోకింది. వీరిలో 300 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 194మంది ప్రాణాలు కోల్పోయారు. 24గంటల్లో కొత్తగా 1076 కేసులు, 32 మరణాలు నమోదైనట్టు కేంద్రం తెలిపింది.