రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వలంటీరు పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కొంతమంది వలంటీర్లు విధులకు గైర్హాజరవడం, కొందరు కొవిడ్-19 సమయంలో రాజీనామా చేయడంతో వలంటీర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. కొవిడ్-19 సందర్భంగా డోర్ డెలివరీ సేవలు అందించాల్సిన నేపథ్యంలో ఈ పోస్టులన్నీ భర్తీ చేయాలని మండలాల ఎంపీడీవోలను ఆదేశిస్తూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కన్నబాబు మార్గదర్శకాలను జారీచేశారు. వలంటీర్ పోస్టుల్లో 50 శాతం మహిళలకు కేటాయించాలని పేర్కొన్నారు. ఈ నెల 20న అన్ని మండలాలు, పట్టణాల్లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఆయా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు నోటిఫికేషన్లు జారీచేయాలని, 20 నుంచి 24 వరకు దరఖాస్తులు స్వీకరించి, 25న పరిశీలించాలని ఆదేశించారు.
ఏపీలో గ్రామ వాలంటీర్ల నియామకం
Related tags :