NRI-NRT

న్యూజెర్సీ కరోనా బాధితుల సేవలో శ్యాం నల్లం

Telugu Nallam Family Helping Corona Patients via Adlee Pharmacy In Manlapan NJ

న్యూజెర్సీకి చెందిన ప్రవాసాంధ్రుడు, ఫార్మసీ సంస్థల అధినేత, నాట్స్ ఉపాధ్యక్షుడు శ్యాం నల్లం ఆధ్వర్యంలో కరోనా బాధితులకు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. వయోవృద్ధులకు ఉచితంగా మందులను పంపిణీ, డెలివరీ చేస్తామని శ్యాం తెలిపారు. విటమిన్ మాత్రలు, మాస్క్‌లు, శానిటైజర్లు అవసరమైన వారికి ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. ఈ సదుపాయాన్ని వినియోగించదలిచినవారు 732-431-9400 నెంబరులో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమానికి శ్యాం సతీమణి శైలజ కూడా సహకరిస్తున్నారు.