చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. చైనా ఉద్దేశపూర్వకంగానే కరోనా వైరస్‌ను వ్యాప్తి చేసినట్లు తేలితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కరోనాకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించడంలో, ఆ విషయాలను తమతో పంచుకోవడంలో చైనా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. శనివారం ఆయన తన అధికార నివాసం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ ‘తొలుత చైనాతో అమెరికాకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఎప్పుడైతే కరోనా వైరస్ బయటపడిందో అప్పటి నుంచి ఆ దేశంపై కోపం వస్తున్నది. ఒకవేళ చైనా ఉద్దేశపూర్వకంగానే వైరస్‌ను వ్యాప్తి చేసినట్లు తేలితే ఆ దేశం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు.
పింగూ…బీ రెడీ
Related tags :