Movies

కొరియా కథలో…

Actress Regina Cassandra Latest Telugu Movie News - April 2020

రీమేక్‌ సినిమాల ట్రెండ్‌ టాలీవుడ్‌లో కొనసాగుతోంది. వివిధ భాషల్లో విజయంతమైన సినిమాల్ని తెలుగులో రీమేక్‌ చేసేందుకు అగ్రనాయకానాయికలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా కొరియన్‌ భాషలో పెద్ద సక్సెస్‌గా నిలిచిన ‘మిడ్‌నైట్న్న్రర్స్‌’ చిత్రం తెలుగులో రీమేక్‌ కానున్నట్లు సమాచారం. సుధీర్‌వర్మ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో రెజీనా, నివేథాథామస్‌ కథానాయికలుగా నటించనున్నట్లు తెలిసింది. ప్రతినాయకుడి పాత్రలో నవీన్‌చంద్ర నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ కిడ్నాపింగ్‌ కేసును ఛేదించే పోలీస్‌ శిక్షణ పొందుతున్న ఇద్దరు యువకుల కథతో కొరియన్‌ చిత్రం రూపుద్దిదుకున్నది. ఈ రీమేక్‌కు సురేష్‌బాబు, సునీత తాటి నిర్మాతలుగా వ్యవహరించనున్నట్లు సమాచారం. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిసింది.