గులాబీ జెండాను ఆస్ట్రేలియాలో రెపరెపలాడించి సీఎం కేసీఆర్‌కు ఉద్యమ సమయం నుంచి వెన్నుదన్నుగా నిలిచిన టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా మహిళా విభాగం నాయకురాలు హేమ సాయిరాం ఉప్పు.. జిల్లాలోని ఖానాపూర్ జడ్పీటీసీ టీఆర్‌ఎస్ అభ్యర్థినిగా నామినేషన్ వేశారు. టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా తరుపున హేమకు టీఆర్‌ఎస్ తరుపున టికెట్ ఇప్పించిన కవిత, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా ఆవిర్భావం నుంచి తమకు తోడుగా ఉన్న సోదరి హేమకు పార్టీ నుంచి సరైన గుర్తింపు రావడం ఎంతో సంతోషంగా ఉందని.. ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలని నాగేందర రెడ్డి ఖానాపూర్ ప్రజలను కోరారు.
ఆస్ట్రేలియా ఎన్నారై తెరాస నాయకురాలికి జడ్పీటీసీ టికెట్
Related tags :