Politics

ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచండి

YS Jagan Orders To Increase Bed Counts At Govt Hospitals

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా దానికి తగ్గట్టుగా ఆయా జిల్లాల ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. తీవ్రత ఎక్కువగా ఉన్న పట్టణాల్లో ఆస్పత్రులను గుర్తించి అక్కడే చికిత్స అందించాలని సూచించారు. టెలీమెడిసిన్‌ ద్వారా కాల్‌ చేసిన వారికి మందులు కూడా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి హాజరయ్యారు.