Devotional

కరోనా వలన పూజారులకు కష్టాలు

కరోనా వలన పూజారులకు కష్టాలు

*పౌరోహిత బ్రాహ్మణులకు గడ్డుకాలం*
మనకున్న మంచి రోజులు!
* ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం కరోనా రోజులు. ?
* ఆషాఢం శూన్య మాసం రోజులు. ?
* శ్రావణ మాసం వర్షాకాలం రోజులు. (10 ముహూర్తాలు ఉండవచ్చు)
* గతికే బ్రాహ్మణులకు, బతికేవారికి గణపయ్య నవరాత్రుల మాసం.
* ఆశ్వయుజ మాసం అమ్మ వారికి పూజలు జరిగే పది రోజుల మాసం. కొందరికి మాత్రమే (5 నుంచి 8 ముహూర్తాలు ఉండవచ్చు)
* కరోనా ప్రవాహంలో కూడా తట్టుకుని ఆర్ధికంగా నిలబడ్డ కొందరు యజమానులకు, పైసా ప్రాప్తి ఉన్న కొందరు బ్రాహ్మణులకు కార్తీక మాసం లక్కు మాసం.
* ప్రతీ సంవత్సరం లక్కు తక్కువుండే మార్గశిర మాసం.
* ఇన్ని రోజులు బాగా కష్టపడి సంపాదించారు కదా అన్నట్లుగా మళ్లీ శూన్య మాసం పుష్య మాసం.
* ఈ కష్టాలన్నీ మరచిపోయి సుఖంగా ఉందామని అనుకునే లోపే మాఘం,ఫాల్గుణం రెండు మాసాలూ కొబ్బరి బోండాం లాంటి పేద్దది గురు మూఢమ, శుక్ర మూఢమల గిఫ్ట్!

ఈ కరోన ఎఫెక్ట్ వలన ఎక్కువగా నష్టపోయిన వారు కేవలం బ్రాహ్మణులే!

ఎలానో చూద్దాం.
భూములు లేని వారే ఎక్కువ ఉన్నారు బ్రాహ్మణులు. (రైతు బంధు పథకం వర్తించదు. )
దరిద్రాన్ని అనుభవిస్తున్నారు అన్నా ప్రభుత్వం,అధికారులు కూడా నమ్మరు. ఎందుకంటే అగ్రకులం!
డబ్బులు లేవన్నా,పనులు లేవన్నా ఎవరూ నమ్మరు.
ఎవరికీ చెప్పుకోలేని మొహమాటం.
అందరూ బాగుండాలి అందులో మనమూ ఉండాలి.
(ఓ మధ్యతరగతి పౌరోహితుడి ఆవేదన)

సర్వేజనా: సుఖినోభవంతు