Movies

లాక్‌డౌన్ తర్వాత స్పష్టత

లాక్‌డౌన్ తర్వాత స్పష్టత

కరోనా కారణంగా ప్రపంచమే మారిపోయిందని అంటోంది హాట్ బ్యూటీ దిశా పటానీ. కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచమంతా లాక్‌డౌన్ మోడ్‌లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. పర్యావరణానికి సంబంధించి మన దేశంలో కాలుష్యం విపరీతంగా తగ్గిపోయింది. ఇవన్నీ ఆహ్వానించదగ్గ మార్పులే. “ఈ మార్పులు చూస్తోంటే చాలా ఆనందంగా వుంది. మనం ఈ భూమ్మీదకి అతిథులుగానే వచ్చాం. భూమిని నాశనం చేయకుండా మన ముందు తరాలకు ఆ వనరులను భద్రంగా ఇవ్వడం మన బాధ్యత” అని చెప్పింది దిశా పటానీ. “ప్రపంచం మునుపటిలా ఖచ్చితంగా ఉండదు. అదెలా మారుతుందో ఇప్పుడే చెప్పలేం. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాతే ఆ పరిస్థితులపై కాస్త స్పష్టత రావచ్చు” అని దిశా పేర్కొంది.