Business

పాపం…ఓయో ఉద్యోగులు

పాపం…ఓయో ఉద్యోగులు

హోటల్‌ గదులను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచే ఆగ్రిగేటర్‌ సంస్థ ఓయో, కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా తమ సిబ్బంది స్థిరవేతనంలో 25 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. మే 4 నుంచి కొందరు సిబ్బందికి 4 నెలల పాటు సెలవు ఇవ్వనుంది. వీరికి పరిమిత ఆర్థిక ప్రయోజనాలు మాత్రం కల్పించనుంది. సంస్థకు దేశీయంగా 10,000 మంది ఉద్యోగులుండగా, కరోనా లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో తీవ్ర ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు ఓయో ఇండియా దక్షిణాసియా సీఈఓ రోహిత్‌ కపూర్‌ వెల్లడించారు. మే 4 నుంచి ఆగస్టు నుంచి సెలవు ఇస్తున్న సిబ్బంది కూడా స్థిరవేతనంలో 60 శాతం, ఆరోగ్య బీమా, పేరెంటల్‌ ఇన్సూరెన్స్‌, పాఠశాల రుసుము తిరిగి చెల్లింపు, ఎక్స్‌గ్రేషియా సహకారం వంటివి ఉంటాయని తెలిపారు. ఆరోగ్య అత్యవసర స్థితి ఎవరికైనా తలెత్తితే, బీమా మొత్తానికి మించి సహకరిస్తామని వెల్లడించారు.