WorldWonders

యావత్ పోలీసు స్టేషన్ సిబ్బందికి కరోనా

Entire Staff Of Police Station Tested Positive For COVID19

తాజాగా వైర‌స్ కార‌ణంగా ఓ పోలీస్ స్టేష‌న్‌కే తాళాలు వేసిన సంఘ‌ట‌న చోటుచేసుకుంది.భార‌త్‌లో క‌రోనా విల‌య తాండ‌వం చేస్తోంది. ఇప్ప‌టికే వైర‌స్ కేసుల సంఖ్య 23 వేలు దాటినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 12 గంటల్లో 1,377 కేసులు నమోదు కాగా, 32 మంది మరణించారని తెలిపింది.

దేశవ్యాప్తంగా 23,077 పాజిటివ్ కేసులు నమోదయినట్టు పేర్కొంది. దేశంలో ఇప్పటి వరకూ కరోనాతో 718మంది మృతిచెందారని, కరోనా నుంచి 4,749 మంది కోలుకున్నట్టు తెలిపింది. త‌మిళ‌నాడులో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది.

తాజాగా వైర‌స్ కార‌ణంగా త‌మిళ‌నాడులోని ఓ పోలీస్ స్టేష‌న్‌కే తాళాలు వేసిన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే…
తమిళనాడులోని తిరుపత్తూర్ జిల్లా లో పోలీసులకు కోవిడ్‌-19 నిర్ధ‌రాణ అయ్యింది. పోలీసుల‌కు కరోనా వైరస్ సోకడం  అక్కడి పోలీసు స్టేషన్ ను మూసివేశారు. ఉమ్మడి వెల్లూర్ లోని  ప్రాంతాలలో  పోలీసులకు, ప‌లువురు జ‌ర్న‌లిస్టుల‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా…వీరిలో  వానియంబడి లోని మహిళ ఇన్స్పెక్టర్ కి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది.

దీంతో వానియంబడి పోలీస్ స్టేషన్ మూసివేసిన అధికారులు   స్టేషన్ సిబ్బంది 37 మందిని, వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్ కి తరలించారు.