Fashion

ఈ మాస్కు కరోనా తర్వాత కూడా వాడుకోవచ్చు

Telugu Fashion News - Masks That You Can Use After LockDown As Well

లాక్‌డౌన్‌ సమయంలో బయటకు వెళితే మాస్క్‌ తప్పనిసరి. ఇది అయ్యాక కూడా మాస్క్‌లు ధరిస్తే మంచిదంటారు ఆరోగ్య నిపుణులు. ఇప్పుడైతే గాలి కాలుష్యం లేదు కాబట్టి మామూలు మాస్క్‌లు సరిపోతాయి. కానీ జనం, వాహనాలు వీధుల్లోకి వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? ఆ గాలిని, ఈ వైరస్‌ని ఎదుర్కోవడానికి ఒక సంస్థ ప్రత్యేకమైన మాస్క్‌ని తయారుచేసింది. ఇది ముక్కును, నోటిని కవర్‌ చేస్తూ చెవి వరకు ఉంటుంది. ముందు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండి చెవుల దగ్గర చిన్న ఫిల్టర్లు ఉంటాయి. ఇవి కాలుష్యాన్ని, వైరస్‌లను దరికి రానీయవు. పైగా స్వచ్ఛమైన గాలిని మాత్రమే లోపలికి పంపించేలా ఈ మాస్క్‌ తయారుచేశారు. అంటే.. అటు కాలుష్యాన్ని, ఇటు వైరస్‌ని సమర్థంగా ఎదుర్కొంటుందన్నమాట. అందుకే దీని ధర రూ. 25 వేలకు పైనే ఉందట.