Movies

శ్రియ సత్తా

శ్రియ సత్తా

హీరోయిన్‌గా టాప్ స్థానంలో కొనసాగిన నటి శ్రియా శరణ్.. ఇప్పుడు పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని చక్కగా కొనసాగిస్తుంది. అయితే సినిమాలకు మాత్రం దూరం కాలేదు అంటూనే.. మంచి కథ ఉంటేనే అంటూ ఏ సినిమాకూ ఓకే చెప్పకుండా భర్తతో విదేశాల్లో షికార్లు చేస్తుంది. మీకు అవకాశాలు రావడం లేదా.. లేక కావాలనే సినిమాలను వదిలేశారా? మరి ప్రత్యేక గీతాలు చేస్తున్నారుగా అంటే.. శ్రియ ఏం చెప్పిందో తెలుసా?.. ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే..‘‘వచ్చిన పాత్రలన్నీ ఒప్పుకోవలసిన అవసరం నాకు లేదు. ఇదే కాకుండా మరో కారణం కూడా ఉంది. కొంతమంది దర్శకనిర్మాతలు నాకు చెప్పే కథ ఒకటిగా వారు తీసేది మరొకటిగా ఉంటోంది. అలాంటి అనుభవాలు ఇటీవలి కాలంలో నాకు ఎదురయ్యాయి. అందుకే పూర్తి కథతో వస్తేనే చేస్తున్నాను. ఏదో ఒకటి రెండు లైన్లు చెప్పి నన్ను మోసం చేయాలనుకునేవారికి నో చెప్పేస్తున్నాను. మరి స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారుగా అని కొందరు అడుగుతున్నారు. అలాంటి వారికి నేను చెప్పేది ఏమిటంటే.. నేను స్పెషల్‌ సాంగ్స్‌ చేసే సమయానికి హీరోయిన్లు ఎవరూ అలాంటి పాటలు చేయడం లేదు. అవి చేస్తే తిరిగి హీరోయిన్‌గా అవకాశం రాదేమోనని భయపడేవారు. ఆ భయాన్ని పారదోలాలని అనుకున్నాను. స్పెషల్‌ సాంగ్స్‌ చేసినా హీరోయిన్‌గా మనలో సత్తా ఉంటే తప్పకుండా అవకాశాలొస్తాయి. ఈ విషయాన్ని నేను నిరూపించాను. నేను ఓ పాట చేయాలంటే ఆ పాటకి మంచి ప్రాధాన్యం ఉండాలి. అది సినిమాకి ప్లస్‌ కావాలి. అప్పుడే చేస్తాను..’’ అని శ్రియ చెప్పుకొచ్చింది.

Pin on 7