కొత్తగా పెళ్లైన జంటకు కరోనా పాజిటివ్ రావడంతో..ఊరు మొత్తాన్ని అధికారులు దిగ్భదించారు. గ్రామంలో అందరిని క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు నిర్వహించారు. గ్రామం మొత్తం స్ర్కీనింగ్ చేసేందుకు గ్రామంలోకి పూర్తిగా రాకపోకలు నిషేధించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బర్దా ఏరియాలోని ఆజంఘర్ జిల్లా.. చత్తాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన యువకుడు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువతిని వివాహం మార్చి 23వ తేదీన పెళ్లి జరిగింది. కాగా కొద్దిరోజుల అనంతరం వరుడు స్వరాష్ట్రమైన రాజస్థాన్‌కు ఏప్రిల్ 14వ తేదీన కొత్త జంట పయనమయ్యారు. అయితే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అజంఘర్ నుంచి ఈ జంట వచ్చిన విషయం తెలుసుకొన్న అధికారులు సరిహద్దులోనే వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో ఈ వధూవరులకు కరోనా సోకిందని గుర్తించారు. వెంటనే చత్తార్పూర్ గ్రామానికి సమాచారం చేరవేశారు రాజస్థాన్ అధికారులు. వెంటనే పెళ్లికి హాజరైన జనంతో పాటు..గ్రామాన్ని దిగ్బంధంలోని తీసుకుని పరీక్షలు నిర్వహిస్తున్నారు.
వీళ్ల పెళ్లి వాళ్ల చావుకు వచ్చింది
Related tags :