NRI-NRT

న్యూజెర్సీలో భారతీయ దంపతుల అనుమానస్పద మృతి

Indian Couple Garima Kothari Manmohan Mall Dead In New Jersey

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం జెర్సీ సిటీకి చెందిన ప్రవాస భారతీయులు గరిమ కొఠారి, మన్మోహన్ మాల్‌లు అనుమానస్పద రీతిలో మృతి చెందారు. వీరు నుక్కడ్ అనే హోటల్‌ను నిర్వహిస్తున్నారు. ఇటీవలే గరిమ తన ఫేస్‌బుక్ ఖాతాలో కోవిడ్ కారణంగా దెబ్బతిన్న తమ వ్యాపారాన్ని సజావుగా సాగించేందుకు నిధులను విరాళంగా అందజేయాలని కోరారు. గరిమ పారిస్‌లో పాకశాస్త్రాన్ని అభ్యసించగా ఆమె భర్త మన్మోహన్ ఐఐటీ ఖరగ్‌పూర్ నుండి పట్టభద్రులు. వీరి మరణానికి సంబంధించిన కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.