Ø తెలంగాణా పీసిసి అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి నేడు గవర్నెర్ ను కలిసి కేసిఆర్ పరిపాలన పై ఆరోపణలు చేసారు. విద్యార్ధులు చేసుకుంటున్న ఆత్మాహత్యలను ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలని మృతి చెందినా ఒక్కో విద్యార్ధి కుటుంబానికి 25 లక్షలు చెల్లించాలని కోరారు
Ø భజాపా సీనియర్ నేత కిషన్ రెడ్డి తల్లి 80 ఏళ్ల ఆండాల్లమ్మ మృతిచెందారు
Ø తెలంగాణాకు చెందిన వివిధ పార్టీల నాయకులు నేడు గవర్నెర్ ను కలిసారు. ఇంటర్ బోర్డ్ అవకతవకలపై విచారణ కోసం డిమాండ్ చేశారు
Ø సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అధికారులు నేడు పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించి మట్టి డంపింగ్ ప్రాంతాలను పరిశీలించారు
Ø మార్కాపురంలో శ్రీలక్ష్మీ చేన్నకేసవస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి
Ø తూగో జిల్లా కనకాలపెటలో నూతనంగా నిర్మించిన శ్రీగణేష్, సుబ్రమణ్యస్వామి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు
Ø గుంటూరు నగరపాలక సంస్థలో పౌరసేవాలు నిలిచిపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు
Ø కడప మున్సిపల్ కార్యాలయం ముందు మూడు నెలల జీతం బకాయిలు చెల్లించాలని కోరుతూ కార్మికులు ఆందోళన చేశారు
Ø కడపలో గంగాలమ్మ జాతర బుధవారం అర్ధరాత్రి నుండి ప్రారంభం అయ్యింది
Ø ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కోసం 21వేల మంది సిబ్బందిని నియమిస్తునట్లు ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది తెలిపారు
Ø వారణాసిలో ప్రధాని మోడీపై కాంగెస్ అభ్యర్ధిగా అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు
Ø ఆమ్ ఆద్మీ పార్టీ తన ఎన్నికల మానిఫెస్టో ను విడుదల చేసింది
Ø భార్యలు చెప్పినట్లు భర్తలు వోటు వేయ్యకపోతే వారికి అన్నం పెట్టవద్దని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పిలుపునివ్వటం సంచలనం కలిగించింది
Ø రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం నేడు న్యూడిల్లీ వెళ్ళారు