వైభవంగా టాంటెక్స్ ఉగాది వేడుకలు


ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో ఇర్వింగ్‌లోని మెక్ఆర్థర్ హైస్కూల్ లో హేవళంబి ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, కార్యక్రమ సమన్వయకర్త పాలేటి లక్ష్మి, సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త తోట పద్మశ్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు అలరించాయి. ఉగాది పచ్చడి, ఘుమఘుమలాడే పసందైన భోజనాన్ని స్థానిక బావర్చి రెస్టారెంట్ వారు అందించారు. 1100 మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. అమెరికా జాతీయ గీతంతో కార్యక్రమం ప్రారంభమై, ‘ఏకదంతాయ వక్రతుండాయ” అంటూ ఫ్యూజన్ నృత్యంతో సాగి, వివిధ సంప్రదాయక నృత్యాలతో కార్యక్రమాలు సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ కొనసాగాయి. భారత దేశం నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన కోమలి సోదరీమణులు కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ, చక్కటి మాటలతో , మిమిక్రీ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు.. సంప్రదాయమైన నృత్యాలతో పాటు, సినిమా పాటల సమాహారం వంటి చక్కని డాన్సు మెడ్లీలు, జానపద గీతాలు, స్థానిక కళాకారుల ప్రదర్శనలతో ఆకట్టుకున్నాయి. “రామాయణం” నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకుల మనసును దోచుకున్నది. కంటంరాజు సాయికృష్ణ పంచాంగ శ్రవణం గావించారు. భారతదేశం నుండి ప్రత్యేకంగా విచ్చేసిన మెజీషియన్ వసంత్ తన ప్రతిభావంతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. యువ గాయకుడు కూరపాటి సందీప్ గానలహరి మైమరిపించింది. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి ఉగాది శుభాకాంక్షలతో విచ్చేసిన వారందిని ఉద్దేశిస్తూ తన సందేశంలో ఈ సంవత్సరం చేయబోతున్న కార్యక్రమాల వివరణతో పాటు, సుమారు దశాబ్దం పైన డాలస్ లో వున్న తెలుగు వారందరికీ సుపరిచితమైన గాన సుధ – మన టాంటెక్స్ రేడియో” ఫన్ ఏషియా 1110 ఆం లో పునః ప్రారంభమైన రేడియో ప్రసారఒ, సభ్యులకు ఉచిత చలనచిత్ర ప్రదర్శన విషయాలు తెలిపారు. మన తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ, సంగీత, లలిత కళల ప్రాధాన్యంతో “తెలుగు వైభవం” అనే ప్రత్యేక కార్యక్రమం కోసం సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. ఉగాదిని పురస్కరించుకొని టాంటెక్స్ 2017 ’ఉగాది పురస్కారాల’ను ఈ సంవత్సరం వైద్య , తెలుగు భాషాభివృద్ది, విద్యా రంగాలలో విశేష సేవలందించిన వ్యక్తులకు ప్రకటించారు. వైద్యరంగంలో డా.గునుకుల శ్రీనివాస్, తెలుగు భాషాభివృద్ది రంగంలో కే.సి. చేకూరికి , విద్యారంగంలో డా. పుప్పాల ఆనంద్ తదితరులకు ఈ పురస్కారాలను అందించారు. సంస్థ వివిధ కార్యక్రమాలలో ఎనలేని సేవలను అందిస్తున్న దివాకర్ల మల్లిక్, డా. కలవగుంట సుధ, కుమారి మార్పాక పరిమళ, కుమారి తుమ్మల జస్మిత, నిడిగంటి ఉదయ్ లకు ‘ఉత్తమ స్వచ్ఛంద సేవకుడు (బెస్ట్ వాలంటీర్)’ పురస్కారంతో సత్కరించారు. దాతలు ణ్శీ సంస్థకు, రాం కొనార, పోలవరపు శ్రీకాంత్ ,రిచ్మండ్ హిల్ మోంటెస్సోరి సంస్థకు, ప్రాడిజీ టెక్నాలజీస్ సంస్థకు, వీర్నపు చినసత్యం తదితరులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు. పాలెటి లక్ష్మీ వందన సమర్పణ చేసి వేడుకల విజయవంతానికి కృషిచేసిన్వారికి ధన్యవాదాలు తెలిపారు.
More News

One thought on “వైభవంగా టాంటెక్స్ ఉగాది వేడుకలు

  1. vasanth ramadugu

    మంచి కార్యక్రమం,
    ప్రేక్షకులు కాస్త ఎక్కువగానే వచ్చారనిపించింది,
    tantex గ్రూపు సబ్యులకు ధన్యవాదములు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com