Movies

హాలీవుడ్‌లోకి

parineeti chopra to star in hollywood remake

హాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన చిత్రం ‘ఎ గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌’. ఎమిలీ బ్లంట్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయనున్నారు. ఇందులోని ప్రధాన పాత్రలో బాలీవుడ్‌ నాయిక పరిణీతి చోప్రాను ఎంపిక చేశారు. రిబు దాస్‌ గుప్తా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో నటించడం గురించి పరిణీతి మాట్లాడుతూ ‘‘నన్ను ఇప్పటివరకూ ప్రేక్షకులు చూడని పాత్రలో నటించబోతున్నాను. ఈ పాత్ర కోసం చాలా కష్టపడాలి. మద్యానికి బానిసైన ఓ అమ్మాయి పాత్ర ఇందులో పోషించనున్నాను’’ అని చెప్పింది. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.