Health

నులిపురుగుల నాశనానికి

bitter gourd eliminates hook worms

రుచికి చేదుగా ఉండే కాకర ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాకరకాయలో గ్లూకోజ్‌ను అదుపు చేసే గుణం ఉండడం వల్ల ప్రతిరోజూ వీటిని తింటే షుగర్‌ అదుపులో ఉంటుంది. తీవ్రమైన చర్మ సమస్యలకు నివారిణిగా కాకరకాయ ఉపయోగపడుతుంది. కాకర శరీరంలో పేగుల కదలికలను తేలిక చేసి, ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయిస్తుంది. కాకరకాయ తింటే మలబద్ధకం ఉండదు. గుండె చుట్టూ ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను కాకరకాయ కరిగిస్తుంది. అందువల్ల మంచి రక్తం అంది, గుండె సంబంధిత వ్యాధులు రావు. కాకరకాయలో ఉన్న చేదు వల్ల కడుపులో ఉన్న నులి పురుగులు, ఇతర క్రిములు నశించి, మలం ద్వారా అవి బయటకుపోతాయి. కాకరలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు అనేక రోగాల నివారణకు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి. కాకరకాయలో విటమిన్‌ బి1, విటమిన్‌ బి2, విటమిన్‌ బి3, థైయమిన్‌, క్యాల్షియం, బీటా కేరొటిన్‌ ఉన్నాయి. ఇవి శరీరంలో ఉన్న అన్ని సమస్యలకు చెక్‌ పెడతాయి. తరచూ నోటిపూతతో (మౌత్‌ అల్సర్స్‌) బాధపడేవారికి కాకరకాయే సరైన విరుగుడు. వీటిలో పొటాషియం, ప్యాంటోథెనిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, జింక్‌, మాంగనీస్‌తో పాటు చాలా పోషకాలున్నాయి. ఇన్ని మంచి లక్షణాలున్న కాకరకాయను కనీసం వారానికి ఒకటి లేక రెండుసార్లు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.