అమెరికా వీసాలు కఠినం అంట

అమెరికా వీసాకు దరఖాస్తు చేస్తున్నారా? ఇక నుంచి అగ్రరాజ్యం వీసా పొందడం అంత ఈజీ కాదు.. వీసా దరఖాస్తు పరిశీలన సమయంలో ఏదైనా అనుమానమొస్తే.. మీ ఫేస్‌బుక్, ట్వీటర్‌ ఖాతాల వివరాలతో పాటు, మీ వ్యక్తిగత వివరాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాల్సిందే.. వాటిని చెక్‌ చేసి.. మీపై ఎలాంటి వివాదాలు లేవంటేనే వీసా మంజూరు.. లేదంటే నిరాకరణే.. వీసా నిబంధనల్ని మరింత కఠినం చేస్తూ ట్రంప్‌ సర్కారు తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. అమెరికా కాన్సులేట్‌ ఉద్యోగులకు అనుమానం వస్తే.. గత ఐదేళ్ల సోషల్‌ మీడియా ఖాతాల వివరాలతో పాటు 15 ఏళ్ల వ్యక్తిగత వివరాలు వెల్లడించాలని షరతులు విధించింది. ఈ మేరకు కొత్త నిబంధనల్ని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం రూపొందించింది. ఈ నిబంధనలకు మే 23న అమెరికా మేనేజ్‌మెంట్, బడ్జెట్‌ శాఖ ఆమోదించింది. అన్ని పాత పాస్‌పోర్టు నంబర్లు, సోషల్‌ మీడియా అకౌంట్ల వివరాలు, ఈమెయిల్‌ ఐడీలు, అంతవరకూ వాడిన ఫోన్‌ నంబర్లు, చిరునామాలు, చేసిన ఉద్యోగాల వివరాలు, ప్రయాణాల చిట్టా వంటి సమాచారం సహా 15 సంవత్సరాల వ్యక్తిగత వివరాల్ని సమర్పించాలి. హెచ్‌–1బీ స్టూడెంట్‌ వీసాపై కొత్త నిబంధనలు అమెరికాలో మాస్టర్‌ డిగ్రీ, ఇతర ఉన్నత విద్యల్ని అభ్యసించిన విదేశీ విద్యార్థులకు జారీ చేసే హెచ్‌–1బీ వీసాలపై కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు. విద్యార్థులు డిగ్రీ తీసుకునే సమయానికి ఆ విద్యాసంస్థకు.. యునైటెడ్‌ స్టేట్స్‌ ఇన్‌స్టిట్యుషన్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ గుర్తింపు ఉంటేనే ‘స్టూడెంట్‌ హెచ్‌–1బీ’ వీసాకు అర్హుడని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ విభాగం(యూఎస్‌సీఐఎస్‌) స్పష్టం చేసింది. ప్రతీ ఏడాది 65 వేల హెచ్‌–1బీ, అమెరికాలో ఉన్నత విద్య చదివిన వారికి అదనంగా 20 వేల హెచ్‌–1బీ వీసాలు జారీ చేస్తారు. కాలిఫోర్నియాకు చెందిన లీనా ఆర్‌ కామత్‌ తనకు హెచ్‌–1బీ వీసా(అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన వారికిచ్చే) కేటగిరీలో ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పించాలని దరఖాస్తు చేయగా… ఇమ్మిగ్రేషన్‌ విభాగం తిరస్కరించింది. డిగ్రీ తీసుకునే సమయానికి అతను చదివిన ఇంటర్నేషన్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీకి హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ గుర్తింపు లేదని పేర్కొంది.

More News

2 thoughts on “అమెరికా వీసాలు కఠినం అంట

  1. ranjith

    చెత్త న్యూస్ లు అని పోస్ట్ చేయకు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com