‘‘వృత్తి పరంగా ఆరంభంలో చాలా తప్పులు చేశాను. కానీ వాటి విషయంలో ఎప్పుడూ బాధపడలేదు. నా దృష్టిలో తప్పు చేయడం తప్పేమీ కాదు. దాన్ని కూడా ఒక పాఠంగా మలచుకుంటే చాలా నేర్చుకోవచ్చ’’ని అంది రకుల్‌ప్రీత్ సింగ్. ప్రస్తుతం ‘మన్మథుడు2’ కోసం పోర్చుగల్‌లో గడుపుతోందామె. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. నా ప్రయాణంలో ఆటుపోట్లు లేకపోయుంటే, ప్రస్తుతం దక్కుతున్న విజయాల్ని ఇంతగా ఆస్వాదించేదాన్ని కాదేమో అంటోంది రకుల్. ‘‘విజయం విలువ తెలియాలంటే… పరాజయం ఎలా ఉంటుందో అనుభవంలోకి రావల్సిందే. ఆ విషయాన్ని బలంగా నమ్ముతా. తొలినాళ్లల్లో సినిమాకి సంబంధించి నాకేమీ తెలియదు. దాంతో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొన్నా. ఆ నిర్ణయాలు తొలి అడుగుల్లోనే బోలెడన్ని విషయాలు నేర్చుకోవడానికి కారణమయ్యాయి. ఈ స్థాయికి ఎదగడానికి అవే దోహదం చేశాయి. అయితే తప్పు జరిగిపోయిందే అని అదే పనిగా చింతిస్తూ కూర్చుంటే ఏమీ చేయలేం’’ అని చెప్పింది రకుల్‌ప్రీత్ సింగ్.
తప్పులే పాఠాలు
Related tags :