ఎఫ్‌సీ5 రకానికి చెందిన బంగాళాదుంపల సాగును నిలిపివేస్తేనే గుజరాత్‌కు చెందిన రైతులపై తాము పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామన్న ప్రముఖ శీతలపానీయాల సంస్థ పెప్సికో చివరకు రైతుల పోరాటంతో దిగిరాక తప్పలేదు. దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలతో వెనక్కి తగ్గిన ఆ సంస్థ గుజరాత్ రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామని ప్రకటించింది. పెప్సికోకు చెందిన లేస్, చిప్స్ కోసం ఎఫ్‌సీ 5 రకానికి చెందిన బంగాళదుంపలపై పేటెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, మేథోహక్కు పొందిన బంగాళదుంపలను గుజరాత్‌కు చెందిన నలుగురు రైతులు పండించారని ఆరోపిస్తూ వారిపై పెప్సికో సంస్థ కేసులు పెట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో పెప్సికో తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో పెప్సికో సంస్థ దిగి వచ్చింది.
పెప్సికో తలబిరుసు తగ్గించిన గుజరాత్ రైతులు
Related tags :