Movies

చిరంజీవి ఫాంహౌజ్‌లో భారీ అగ్నిప్రమాదం

fire accident at chiranjeevi's farmhouse in manikonda

టాలీవుడ్ ప్రముఖ నటుడు చిరంజీవి ఫాంహౌస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్ మణికొండలోని ఆయన ఫాంహౌస్‌లో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిరంజీవి తదుపరి చిత్రం ‘సైరా’ కోసం వేసిన సెట్టింగ్ మంటల్లో తగలబడుతోంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంతో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సినిమా సెట్ దాదాపు బూడిదైనట్టు తెలుస్తోంది. దీంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.