Food

మెంతులు తింటే…పడకగదిలో గంతులే!

Fenugreek Seeds Aid In Sexual Potency

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు తరచూ మెంతులను వాడమని సలహా ఇస్తారు ఎందుకంటే దీనిలో మధుమేహాన్ని నియంత్రణ చేసే శక్తి ఉంది. మెంతులకు టైప్ 2 డయాబెటిస్ ను తగ్గించే గుణం ఉందని అధ్యయనాల్లో తేలింది. మెంతులలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల ఆర్థరైటిస్ తో బాధపడేవారికి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుందని పరిశోధనల్లో తేలింది. మెంతులు నెలసరి సమయంలో వచ్చే తిమ్మిరులు, నొప్పులు , ఇతర ఇబ్బందులను తగ్గించడానికి సహకరిస్తాయి. మెంతులలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, నొప్పులను నివారించే గుణాల వల్ల నెలసరి సమయంలో వచ్చే తిమ్మిరులు, కడుపు నొప్పి, నడుము నొప్పి వంటివి తగ్గుతాయని అధ్యయనాల్లో తేలింది. అంతే కాదు, మెంతుల పొడి తల నొప్పి, వికారం వంటి సమస్యలకు కూడా ఎంతో ఉపయోగకరం.జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారికి మెంతులు ఒక వరం వంటివి. గ్యాస్ట్రిక్ ఇబ్బందులకు, మల బద్ధకానికి,, కడుపులో వచ్చే అల్సర్లకు అద్భుతమైన మందు. దీనిలోని సహజమైన జీర్ణ శక్తిని పెంపొందించే అంశాలు జీర్ణాశయాన్నీ, ప్రేగుల పనితీరునూ మెరుగుపరుస్తాయి.