కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో…దశ్దాలకాలంలో ఎన్నడూ చూడని కొత్త విషయాలను ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా సాధ్యం కాని క్లీన్ గంగా…లాక్ డౌన్ తో సాధ్యమైందని చెప్పడంతో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారణాశిలోని పవిత్ర గంగా నదిలో నీటి నాణ్యత పెరిగిందని, దశాబ్దాలలో లేనివిధంగా హరిద్వార్ లోని గంగానీరు తాగేందుకు ఉపయోగపడుతుందని ఇటీవల వార్తల్లో మనం చూసిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ తో ఫార్మా కంపెనీలు మినహా దాదాపు అన్ని పరిశ్రమలు మూతపడటం, పరిశ్రమల వ్యర్థాలు లేకపోవడంతో ఒక్క గంగానది మాత్రమే కాకుండా నిరంతరం భారీ కాలుష్యంతో నిండి ఉండే ఢిల్లీలోని యమునానది సహా అన్ని రాష్ట్రాల్లోని నదులు, సరస్సులలోని నీరు శుద్ధి అవుతుంది.
అయితే ఇప్పుడు గంగానదిలో డాల్ఫిన్లు చక్కర్లు కొడుతూ కొనిపించాయి. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లోని గంగానదిలో డాల్పిన్ లు (తిమింగలం)ఎంచక్కా చక్కర్లు కొడుతూ కనిపించాయి. సాధారణంగా అతి చిన్న కళ్లు, తక్కువ చూపుండే డాల్ఫిన్లు శుద్దమైన నీటిలో నివసిస్తుంటాయి. ఇపుడు గంగా నదిలో డాల్ఫిన్ లు ఈత కొడుతుంటే..పవిత్ర గంగా నది శుభ్రమైనట్లేననిపిస్తోంది.
లాక్ డౌన్ కు ముందు గంగానదిలో కలుషిత పదార్థాల కలయిక వల్ల సముద్ర జీవులకు ఆ నీటిలో ఉండేందుకు ప్రతికూల పరిస్థితులు ఉండేవి. కానీ ఇపుడలాంటి పరిస్థితులేమి లేవని చెప్పేందుకు ఉదాహరనే ఇది అంటూ భారత అటవీ శాఖ అధికారి ఆకాష్ దీప్ బాధవన్ షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మీరట్ లోని గంగా నదిలో ఈ డాల్ఫిన్లను గుర్తించడం తన అదృష్టమని భారత అటవీ శాఖ అధికారి ఆకాష్ దీప్ బాధవన్ ఈ వీడియోను షేర్ చేశారు. గంగా నది డాల్ఫిన్, ఒకప్పుడు గంగా-బ్రహ్మపుత్ర-మేఘనా నది వ్యవస్థలో నివసించిన జాతీయ జల జంతువు ఇప్పుడు అంతరించిపోతోందంటూ బాధవన్ ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. చేపల సమృద్ధిగా, నీటి ప్రవాహాలు నెమ్మదిగా ఉన్న ప్రదేశాలలో మంచినీటి డాల్ఫిన్లు కాబడుతుంటాయని బాధవన్ తెలిపారు.
మీరట్ సమీపంలోని గంగా నదిలో కనిపించిన డాల్ఫిన్… గంగా, బ్రహ్మపుత్ర నదులలో భారత్, బంగ్లాదేశ్, నేపాల్లోని వాటి ఉపనదులలో కనిపించే మంచినీటి డాల్ఫిన్. భారతదేశ జాతీయ జల జంతువుగా గుర్తించబడిన డాల్ఫిన్ ఇప్పుడు అంతరించిపోతున్న జాతిగా పరిగణించబడుతోన్నతరుణంలో ఇప్పుడు గంగానదిలో ప్రత్యక్షమవ్వడం వన్యప్రాణుల ప్రేమికులందరినీ ఎంతగానో అబ్బురపరుస్తోంది.