Fashion

ఐసుగడ్డల ఫేషియల్ విశేషాలు

Ice Cube Facial - Telugu Fashion News For Summer

ఎండలు మండుతున్నాయి.. లాక్‌డౌన్‌ పుణ్యమా అని ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టట్లేదు. ఉక్కపోత, ఎండ తాపానికి ఫేసంతా డల్‌గా అయిపోతుంది. బయటకు వెళ్లి ఫేసియల్‌ చేయించుకుందామన్న ఆ ఛాన్సేలేదు. మరి ఇంట్లోనే ఉండి ముఖం నిగనిగలాడాలంటే ఏంచేయాలి?

దీనికి పరిష్కారం ఐస్‌క్యూబ్‌ ఫేసియల్‌… అదెలాగో చూద్దాం.. దీన్ని ఆడ, మగ తేడా లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు. ఇంట్లో దొరికే వస్తువలతో ఈ ఫేసియల్‌ చేసుకోవచ్చు.

1. తెరచుకుని ఉన్న స్వేద రంధ్రాలు బిగుతుగా ఉండేలా చేస్తుంది. ఎక్సెస్ ఆయిల్ తయారవకుండా తగ్గిస్తుంది. తద్వారా చర్మం సుతి మెత్తగా తయారవుతుంది.

2. కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలు, ఉబ్బినట్టుగా ఉంటే ఐస్ క్యూబ్ థెరపీ ద్వారా వాటికి పరిష్కారం కనుగొనవచ్చు.

3.మరగించిన గ్రీన్ టీ, వడబోసిన నీటిని ఐస్ క్యూబ్ ట్రేలో ఉంచి గడ్డకట్టేలా చేయాలి. ఆ తర్వాత కళ్లపై ఐస్ క్యూబ్ లను నిర్ణీత సమయం ఉంచటం ద్వారా నల్లటి వలయాలు, ఉబ్బినట్టుగా ఉండటం వంటి సమస్యలను క్రమంగా దూరం చేసుకోవచ్చు.

4. ముఖంపై వచ్చే మొటిమలను నివారిస్తుంది. కొత్తగా వస్తున్న లేదా అంతకుముందు నుంచే మొటిమలపై ఐస్ క్యూబ్ తో చిన్నగా రుద్దడం ద్వారా వాటికి చెక్ పెట్టవచ్చు.

5. ఐస్ క్యూబ్ లతో మసాజ్ ద్వారా రక్త ప్రసరణ మెరుగుపరచుకోవచ్చు. తద్వారా చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. ఐస్ క్యూబ్ ట్రేలో మసాజ్ ఆయిల్స్ ను చేర్చి కూడా ఐస్ క్యూబ్ లను ఉపయోగించుకోవచ్చు. తద్వారా స్పా కు వెళ్లిన అనుభూతిని పొందవచ్చు.

6. చర్మ కాంతికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. దోసకాయ ముక్కలు, తేనే, నిమ్మరసంను ఐస్ క్యూబ్ ట్రేలో ఉంచి గడ్డకట్టేలా చేయాలి. ఆ తర్వాత ఒక ఐస్ క్యూబ్ ను తీసుకుని చర్మంపై రుద్దితే మంచి ఫలితాలు వస్తాయి. చర్మం నిగనిగలాడుతుంది.