ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా సవాల్ విసిరారు. ‘చంద్రబాబూ … చందాలూ దందాలూ అంటూ నాపై ఆరోపణలు చేశారు. మీ ఆస్తులు, నా ఆస్తులపై సీబీఐ విచారణ కోరుతూ లేఖలు రాద్దాం, పిటీషన్లు వేద్దాం. కచ్చితంగా విచారణ జరిగేలా చూద్దాం. రెడీనా? శవ రాజకీయాల కోసం చంద్రబాబుకు మరణ మృదంగం మోగుతుండాలి. కరోనా మరణాలు రాష్ట్రంలో 2 శాతం మాత్రమే ఉండటంతో దిక్కుతోచడం లేదాయనకు. వాటినీ దాస్తున్నారని బురద కుమ్మరించడానికీ సిగ్గుపడడు. 2 లక్షల టెస్టింగ్ కిట్లను కొరియా నుంచి కొన్నది దేశం మొత్తం మీద ఆంధ్రానే. ఇలాంటివి కనిపించవు. కరోనా వైరస్ ఇప్పట్లో కనుమరుగు కాదు. కొంత కాలం దాంతో కలిసుండాల్సిందే అన్నందుకు సిఎం జగన్ గారు చేతులెత్తేశారని ఎద్దేవా చేశాడు. ఎల్లో మీడియా ‘జయము జయము చంద్రన్న’ భజన అందుకుంది. ప్రపంచమంతా అంటున్నదే సిఎం గారు చెప్పారు. ఏదైనా మంత్ర దండం ఉంటే దేశాన్ని కాపాడొచ్చు గదా బాబూ!’ అంటూ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.
జయము జయము భజనలో….
Related tags :