Politics

కోడెలను కాకుల్లా పొడుచుకు తిన్నారు

Chandrababu Slams YSRCP On Kodela's Birth Anniversary

ప్రజల కోసం పోరాడే వ్యక్తిత్వం, అపన్నులకు అండగా నిలిచి భరోసా ఇచ్చే గుండె ధైర్యం కోడెల శివప్రసాదరావు సొంతమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు. కోడెల జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేశారు. రూపాయి డాక్టరుగా పేదలకు అందించిన వైద్యసేవలే… కోడెలను ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రమ్మని పిలిచేలా చేశాయన్నారు. ప్రజల్లో కోడెలను పల్నాటి పులిగా నిలిపాయన్నారు. అలాంటి వ్యక్తి కుటుంబంపై 19 కేసులు పెట్టి, వైకాపా నేతలంతా కాకుల్లా పొడుచుకుతిన్నారని మండిపడ్డారు. మానసికంగా కుంగదీసి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని దుయ్యబట్టారు. వైకాపా క్రూర రాజకీయానికి కోడెల మృతి ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. ఈరోజు కోడెల శివప్రసాద్‌ జయంతి సందర్భంగా ఆయన ప్రజా సేవలను మననం చేసుకుందామని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.