తిరుమల తిరుపతి దేవస్థానంలో (తితిదే) పరిధిలో పనిచేస్తున్న 1300 మంది పారిశుద్ధ్య సిబ్బందికి తాత్కాలిక ఊరట కల్పించడంపై ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కార్మికుల సేవలను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడంపై తితిదే బోర్డు, ప్రభుత్వానికి పవన్ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్మికులను మళ్లీ విధుల్లోకి తీసుకుని తితిదే పాలకవర్గం, అధికారులు మానవత్వాన్ని చాటుకున్నారన్నారు.
కార్మికుల దీర్ఘకాలిక, స్థిరమైన సంక్షేమం దిశగా ప్రభుత్వం, తితిదే చర్యలు తీసుకోవాలని పవన్ విజ్ఞప్తి చేశారు.
పవన్ హ్యాపీ
Related tags :