మద్యం డిస్టరీలు ఓపెన్ చేసి మద్యం తయారు చేయించే బదులు.. అన్న క్యాంటీన్లు తెరచి పేదల ఆకలి తీర్చాలని ఏపీ తెదేపా అధ్యక్షుడు కళా వెకంట్రావు హితవు పలికారు. ఆధునిక యుగంలో కూడా రాష్ట్రంలో పేదలు అర్ధాకలితో అలమటిస్తున్నారంటే వైకాపా నేతలు సిగ్గుపడాలన్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టలేని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. ప్రపంచమంతా కరోనా నివారణకు ఔషధం తయారు చేసే పనిలోఉంటే ..జగన్ మాత్రం కమీషన్ల కోసం మద్యం తయారు చేయించే పనిలో ఉన్నారని కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు రోజుకీ కరోనాకేసులు పెరిగి నత్యావసర సరకుల దుకాణాలే మూసివేసే పరిస్థితి ఉంటే మద్యం దుకాణాలు తెరవాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. మద్యం షాపులు ఏమైనా మెడికల్ షాపులా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎవరూ వెళ్లవద్దని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతోందన్నారు.
వారికి ఆ మందు…వీరికి ఈ మందు
Related tags :