Movies

కన్నడకు తమన్నా

Tamanna To Kannada Industry-Movie Details

తమన్నా దాదాపుగా 15 ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నారు. నార్త్‌ నుంచి సౌత్‌ వరకు పాపులారిటీ సంపాదించారామె. కమర్షియల్‌ సినిమాలు, లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు, స్పెషల్‌ సాంగ్స్‌.. ఇలా అన్ని రకాల సినిమాలు చేశారామె. తాజాగా కథానాయికగా మొదటిసారి ఓ కన్నడ సినిమా చేయబోతున్నారని టాక్‌. యశ్‌ హీరోగా రూపొందిన కన్నడ చిత్రం ‘కె.జీ.ఎఫ్‌’లో చేసిన ప్రత్యేక గీతం ద్వారా తొలిసారి కన్నడ తెరపై మెరిశారు తమన్నా. యశ్‌ హీరోగా నర్తన్‌ అనే కన్నడ దర్శకుడు ఓ ప్యాన్‌ ఇండియా సినిమా చేయబోతున్నారట. ఈ సినిమాలో హీరోయిన్‌ గా తమన్నా పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు తమన్నా ఓకే అంటే కథానాయికగా ఇదే ఆమె చేయబోయే మొదటి కన్నడ సినిమా అవుతుంది.