DailyDose

శోభనానికి కూడా అడ్డుపడుతున్న కరోనా-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-Newly Wed Couple Problems With Coronavirus

* మరికాసేపట్లో పెళ్లి అనగా.. పోలీసులు వచ్చి ‘ఆపండి’ అంటూ వివాహలు ఆపడం పాత సినిమాల్లో చూసే ఉంటాం. సరిగ్గా అలాంటి సంఘటనే కర్ణాటకలో జరిగింది. కాకపోతే సీన్లో కొంచెం ఛేంజ్‌. ఈ సారి పెళ్లి కాదు ఆ నూతన వధూవరులకు తొలిరాత్రి. వచ్చింది పోలీసులు కాదు అధికారులు! ఇంకేముంది ఫస్ట్‌నైట్‌కు బ్రేక్‌ పడింది. వరుడితో పాటు పెళ్లికి హాజరైన 26 మందిని హోం క్వారంటైన్‌ వాసం పడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో చాలా వరకు పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. మరికొందరు నిరాడంబరంగా తంతు కానిచేస్తున్నారు. ఇలానే కర్ణాటక ఉడుపి జిల్లాలో కుత్యూరులో వివాహం జరిగింది. అనంతరం యువకుడు తన స్వగ్రామం బోలాకు పెళ్లికూతురితో చేరుకున్నాడు. అయితే సదరు యువకుడు పెళ్లి కోసం మంగళూరు నుంచి స్వగ్రామానికి వచ్చాడని సమాచారం తెలుసుకున్న ఆరోగ్యశాఖ అధికారులు అతడిని ఇంటికి చేరుకున్నారు. క్వారంటైన్‌కు తరలించారు. పెళ్లికి హాజరైన 26 మందినీ హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు అధికారులు.

* జమ్మూకశ్మీర్‌లోని హంద్వారా జరిగిన ఎన్‌కౌంటర్‌పై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. సైనికుల త్యాగం మరువలేనిదని శ్లాఘిస్తూ ఆదివారం ఆయన ట్వీట్‌ చేశారు. ఉత్తర కశ్మీర్‌లోని హంద్వారాలో ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరులో మేజర్‌, కల్నల్‌ సహా ఐదుగురు సైనికులు ఈ ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై మోదీ స్పందిస్తూ.. ‘‘హంద్వారా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, భద్రతా సిబ్బందికి నివాళులర్పిస్తున్నా. వారి త్యాగం ఎప్పటికీ మరువలేం. దేశం కోసం, దేశ పౌరుల ప్రాణాలను కాపాడడం కోసం వారు అంకితభావంతో పనిచేశారు. వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని ట్వీట్‌ చేశారు.

* నగరంలోని మెహదీపట్నం, టోలిచౌకి ప్రాంతాల్లో నివససిస్తున్న కూలీలు తమను సొంత ప్రాంతాలకు పంపాలంటూ ఆందోళనకు దిగారు. రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లేందుకు సుమారు 1000 మందికిపైగా టోలిచౌకి వంతెన వద్దకు చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో వారంతా ఆందోళనకు దిగారు. కూలీల ఆందోళనతో వెస్ట్‌జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌ అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వలస కూలీల ఆకలి బాధలు తీర్చేందుకు జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌తో చర్చించి టోలిచౌకి ప్రాంతంలో 5 అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు డీసీపీ చెప్పారు. కూలీలు సమీపంలోని పోలీస్‌స్టేషన్లకు వెళ్లి తమ వివరాలు నమోదు చేసుకోవాలని.. ఆ వివరాలను ప్రభుత్వానికి అందజేసి ప్రయాణ ఏర్పాట్లు చేస్తామని చెప్పడంతో వారంతా ఆందోళన విరమించారు.

* దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ వలస కార్మికులు చేస్తున్న సాహస ప్రయాణాలు వారి ప్రాణాలమీదకు తెస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిస్తున్నా తమ సొంత ఊళ్లకు స్వతహాగా ప్రయాణాలు మానడం లేదు. ఈ క్రమంలో కొందరు కాలినడకన వెళ్తుండగా మరికొందరు అందుబాటులో ఉన్న వాహనాలపై ప్రయాణిస్తున్నారు. తాజాగా దిల్లీ నుంచి బిహార్‌కు సైకిల్‌పై బయలుదేరిన యువకుడు మార్గమధ్యంలోనే మృతిచెందిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

* ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారితో వివిధ దేశాలు కకావికలం అవుతున్నాయి. ఈ సందర్భంగా మిగతా దేశాలతో పోల్చితే కొవిడ్‌-19 మరణాల రేటు భారత్‌లోనే అతి తక్కువని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా దేశంలో కొవిడ్‌ మరణాలు రేటు 3.2శాతం ఉందని.. ఇది ప్రపంచంలోనే అతి తక్కువగా కావడం ఊరటనిచ్చే విషయమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ వెల్లడించారు. ఇప్పటికే ఈ వైరస్‌ బారినపడిన వారిలో 10,633మంది కోలుకున్నారని తెలిపారు. ఈ వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారిశాతం భారత్‌లో 26.59గా ఉండటం ఊరట కలిగిస్తోంది. అయితే, గత 14రోజుల క్రితం కేసుల రెట్టింపు 10.5 రోజులు ఉండగా.. ప్రస్తుతం 12రోజులకు చేరిందని కేంద్రమంత్రి తెలిపారు. ఇప్పటివరకు దేశంలో 10లక్షల మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా వీరిలో దాదాపు 30వేల మందికి రెండోసారి పరీక్షలు నిర్వహించారు. ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా ఆదివారం నాటికి కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 39,980కి చేరగా 1301మంది మృత్యువాతపడ్డారు. కేవలం గడచిన 24గంటల్లోనే అత్యధికంగా 2,644 కొత్త పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

* ‘గేమ్ ఆఫ్‌ థ్రోన్స్‌’ నటుడు హాఫ్‌థోర్ జార్న్‌సన్‌ డెడ్‌లిఫ్టింగ్‌తో ప్రపంచ రికార్డు సృష్టించారు. 501 కిలోల బరువు ఎత్తి భళా అనిపించుకున్నారు. 2018లో ‘ప్రపంచంలోనే అత్యంత బలవంతుడు’ టైటిల్‌ దక్కించుకున్న ఆయన శనివారం మరోసారి తన సత్తా చాటారు. ‘నాకు మాటలు రావడం లేదు. నా రోజు అద్భుతంగా గడిచింది. దీన్ని నా జీవితాంతం గుర్తుంచుకుంటా. నేను దీన్ని సాధిస్తానని ముందే చెప్పా.. ఒక్కసారి లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే నాకు నిద్రపట్టదు. ఈ సందర్భంగా నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, గురువులు, సమర్పకులతో పాటు నన్ను ద్వేషించేవారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నా. డెడ్‌లిఫ్ట్‌ ఎత్తాలనే నా కల నిజం కావడానికి సహకరించిన వారికీ థాంక్స్‌. నేను మరింత సాధించగలను అనే నమ్మకం నాలో కలిగింది. ఎంతో సంతోషంగా ఉన్నా’ అని ఈ సందర్భంగా హాఫ్‌థోర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆనందం వ్యక్తం చేశారు. వీడియోను కూడా పంచుకున్నారు. 2016లో ఎడ్డీ హాల్ 500 కిలోల బరువు ఎత్తి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇప్పుడు దాన్ని హాఫ్‌థోర్‌ బ్రేక్‌ చేసి.. చరిత్ర సృష్టించారు.

* కొవిడ్‌-19తో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన సమయంలో దురదృష్టవశాత్తూ తాను మరణిస్తే ఆ వార్తను బయటి ప్రపంచానికి ఎలా తెలియజేయాలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యులు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వెల్లడించారు. కరోనా వైరస్ సోకడంతో ఏప్రిల్‌ 5న లండన్‌లోని సెయింట్‌ థామస్‌ ఆస్పత్రిలో చేరిన ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఏప్రిల్‌ 12న తిరిగొచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆస్పత్రిలో కష్టంగా గడిచిన రోజుల్ని ఆయన గుర్తుచేసుకున్నారు. దాదాపు మరణం అంచుల వరకు వెళ్లివచ్చినట్లు తెలిపారు. ‘ది సన్‌’కి ఇచ్చిన ముఖాముఖిలో ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

* లాక్‌డౌన్‌ కారణంగా తమ సొంత రాష్ట్రాలకు వెళ్లే వారు త్స్ప్.కూపిద్.ఐ/ఎపస్స్ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి డిజిటల్ పాసులను జారీ చేస్తామని వివరించారు. ఇప్పటికే తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు భారీగా దరఖాస్తులు వచ్చాయని… ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ 7వేల పాసులు జారీ చేసినట్లు పోలీసు శాఖ తెలిపింది. మరో 10వేల దరఖాస్తులు పరిశీలించి పాసులు జారీ చేయాల్సి ఉందని వివరించారు.

* లాక్‌డౌన్‌ వల్ల చేనేత వృత్తిపై ఆధారపడ్డ కుటుంబాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ.. ప్రతి ప్రాంతంలో చేనేత వృత్తిపై ఆధారపడ్డ కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. చేనేత కళాకారులకు ఏ రోజు పనిచేస్తే ఆ రోజే కుటుంబం గడిచే పరిస్థితులు ఉన్నాయి. కరోనా మూలంగా లాక్‌డౌన్‌ విధించడంతో పూట గడవడం ఇబ్బందిగా మారింది. చేనేత కుటుంబాలు కష్టాల్లో ఉన్నాయని.. వారి ఈతి బాధలను తెలియచేస్తూ పార్టీ కార్యాలయానికి విజ్ఞాపనలు అందాయి.

* కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలకు పెను సవాల్‌గా మారితే.. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులకు మాత్రం ఓ వరంలా మారింది. జైళ్లలో ఉన్న ఖైదీలకు వైరస్‌ సోకుతుందన్న కారణంతో అక్కడి ప్రభుత్వం వారిని ఇళ్లకు పంపింది. ఇప్పటి వరకు లష్కరే తోయిబా అధినేత హఫీజ్‌ సయీద్‌ సహా అనేక మంది ఉగ్రవాదులకు విముక్తి కల్పించింది. లాహోర్‌లోని ఓ జైళ్లో 50 మంది ఉగ్రవాదులకు కరోనా సోకినట్లుగా ఆ రాష్ట్ర సీఎం తెలిపారు. ఈ నెపంతో ప్రమాదకర ఉగ్రవాదులందరికీ దేశంలో స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కల్పించారు.

* జమ్మూకశ్మీర్‌లోని హంద్వారా జరిగిన ఎన్‌కౌంటర్‌పై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. సైనికుల త్యాగం మరువలేనిదని శ్లాఘిస్తూ ఆదివారం ఆయన ట్వీట్‌ చేశారు. ఉత్తర కశ్మీర్‌లోని హంద్వారాలో ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరులో మేజర్‌, కల్నల్‌ సహా ఐదుగురు సైనికులు ఈ ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై మోదీ స్పందిస్తూ.. ‘‘హంద్వారా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, భద్రతా సిబ్బందికి నివాళులర్పిస్తున్నా. వారి త్యాగం ఎప్పటికీ మరువలేం. దేశం కోసం, దేశ పౌరుల ప్రాణాలను కాపాడడం కోసం వారు అంకితభావంతో పనిచేశారు. వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని ట్వీట్‌ చేశారు.

* మరికాసేపట్లో పెళ్లి అనగా.. పోలీసులు వచ్చి ‘ఆపండి’ అంటూ వివాహలు ఆపడం పాత సినిమాల్లో చూసే ఉంటాం. సరిగ్గా అలాంటి సంఘటనే కర్ణాటకలో జరిగింది. కాకపోతే సీన్లో కొంచెం ఛేంజ్‌. ఈ సారి పెళ్లి కాదు ఆ నూతన వధూవరులకు తొలిరాత్రి. వచ్చింది పోలీసులు కాదు అధికారులు! ఇంకేముంది ఫస్ట్‌నైట్‌కు బ్రేక్‌ పడింది. వరుడితో పాటు పెళ్లికి హాజరైన 26 మందిని హోం క్వారంటైన్‌ వాసం పడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

* నగరంలోని మెహదీపట్నం, టోలిచౌకి ప్రాంతాల్లో నివససిస్తున్న కూలీలు తమను సొంత ప్రాంతాలకు పంపాలంటూ ఆందోళనకు దిగారు. రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లేందుకు సుమారు 1000 మందికిపైగా టోలిచౌకి వంతెన వద్దకు చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో వారంతా ఆందోళనకు దిగారు. కూలీల ఆందోళనతో వెస్ట్‌జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌ అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వలస కూలీల ఆకలి బాధలు తీర్చేందుకు జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌తో చర్చించి టోలిచౌకి ప్రాంతంలో 5 అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు డీసీపీ చెప్పారు.

* ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారితో వివిధ దేశాలు కకావికలం అవుతున్నాయి. ఈ సందర్భంగా మిగతా దేశాలతో పోల్చితే కొవిడ్‌-19 మరణాల రేటు భారత్‌లోనే అతి తక్కువని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా దేశంలో కొవిడ్‌ మరణాలు రేటు 3.2శాతం ఉందని.. ఇది ప్రపంచంలోనే అతి తక్కువగా కావడం ఊరటనిచ్చే విషయమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ వెల్లడించారు. ఇప్పటికే ఈ వైరస్‌ బారినపడిన వారిలో 10,633మంది కోలుకున్నారని తెలిపారు.

* దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ విచారం వ్యక్తం చేశారు. కరోనాపై తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుత పరిస్థితులను క్లిష్టమైన పిచ్‌పై టెస్ట్ మ్యాచ్‌గా అభివర్ణించారు. ‘‘ప్రస్తుతం డేంజరస్‌ వికెట్‌పై టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్నాం. బంతులు వేగంగా వస్తున్నాయి. అలాగే స్పిన్‌ కూడా బాగా తిరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న తప్పులు కూడా చేయకుండా వికెట్‌ కాపాడుకుంటూ టెస్ట్‌ మ్యాచ్‌ గెలవాలి. ఇది చాలా కష్టమన్న విషయం నాకు తెలుసు. కానీ, అందరం కలిసి ఆడితే ఈ మ్యాచ్‌ తప్పకుండా గెలుస్తాం’’ అని గంగూలీ అన్నారు.