NRI-NRT

సింగపూర్‌లో మేడే వేడుకలు

Singapore Telugu Samajam Celebrates May Day With Zoom Call - Offers Insurance

సింగపూర్ తెలుగు సమాజం(STS) అధ్యక్షులు కోటిరెడ్డి ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు జూమ్ వీడియో కాల్ ద్వారా కార్మికులతో సంభాషించి వారికి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులను అంతర్జాలంలో ఈ విధంగానైనా కలవటం సంతోషంగా ఉందని, ఆత్మీయంగా సంభాషించి, అనుకోని ఆపద వచ్చినప్పుడు సింగపూర్ తెలుగు సమాజం తోడ్పాటు అందిస్తుందని భరోసా ఇచ్చారు. అందరూ ఐకమత్యంగా ఉంటూ ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉండాలని ధైర్యం చెప్పారు. త్వరలోనే ఈ పరిస్ధితి నుండి బయటపడగలమని ఆశాభావం వ్యక్తపరిచారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక కార్మికుల నివాసాల్ని సందర్శించాలని కమిటీ నిర్ణయించింది. STS తరఫున కార్మికులకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్ని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.