DailyDose

చరిత్రలో మే 4

tippu sultans death anniversary

*** సంఘటనలు
1989- నాసా – మే 4 తేదీన, పంపిన మాగెల్లాన్ అనే రోదసీ భూమి నుంచి ప్రయాణించి శుక్రగ్రహం మీద దిగింది. 1989 అమెరికా అంటే నాసా 1989 మే 4 తేదీన, పంపిన మాగెల్లాన్ అనే రోదసీ నౌక 15 నెలలు భూమి నుంచి ప్రయాణించి, శుక్రగ్రహం మీద నెమ్మదిగా దిగి, అక్కడి శుక్రగ్రహం నేలను, పర్వతాలను, గోతులను, పటాలుగా (మేప్) తయారుచేయటం మొదలుపెట్టింది. ఆ నౌక శుక్రగ్రహం మీద కొన్ని సంవత్సరాలు ఉంటుంది.

*** జననాలు
1767- త్యాగరాజు – త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు.
1911- ఎస్.వి.ఎల్.నరసింహారావు – ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, బార్ అసోషియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు.
1934- అక్కిరాజు రమాపతిరావు, – పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ రచయిత, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత
1942- దాసరి నారాయణరావు – రాజకీయనాయకుడు, సినిమా దర్శకుడు, రచయిత మరియు సినీ నిర్మాత.
1950- కొనకళ్ళ నారాయణరావు -మచిలీపట్నం లోక్ సభ సభ్యులుగా ఎన్నికైనారు.
1950- నరమల్లి శివప్రసాద్ – తెలుగు సినిమా నటుడు మరియు తెలుగుదేశం నాయకుడు.

*** మరణాలు
1979- గుడిపాటి వెంకట చలం – ప్రముఖ రచయిత.
1799- టిప్పు సుల్తాన్ – ప్రముఖ మైసూరు రాజు.